Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హిమాలయాల్లో పర్వతారోహనకు వెళ్లిన 28 మంది హిమపాతంలో చిక్కుకున్నారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 28 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇందులో 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీకి చెందిన బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ద్రౌపది దండ-2 శిఖరం వద్ద ఈ…