Minister Satya Kumar: ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆర్ధిక రంగంలో దేశంలోనే మొట్ట దటి పీహెచ్‌డీ సాధించిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. అలాంటి ఆయనను న్యాయశాఖకు మాత్రమే పరిమితం చేసి ఆర్థిక, రక్షణ రంగాలకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దూరం చేశారని ఆరోపించారు.
బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు.
కులగణకు బీజేపీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. ఇవాళ ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు ఓటు వేస్తేనే నరేంద్రమోదీ మూడో సారి ప్రధాని అయ్యారన్నారు. బీసీలలో చీలిక తీసుక రావడానికి రాహుల్ గాంధీ పన్నిన కుట్ర ఇది అని, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలో ఏది వెనక్కి తీసుకోవాలో మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పాలన్నారు ఆనంద్ గౌడ్.
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అలీన విధానం, పంచశీలను పొగిడారు. ప్రస్తుత వివాదాలను అంతం చేయడానికి, గ్లోబల్ సౌత్ లో పట్టు పెంచుకోవాలని చూస్తున్న చైనా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
V. Hanumantha Rao: దేశంలో జూన్ 5తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ. V.హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదన్నారు.
Amit Shah: లోక్‌సభలో కాశ్మీర్ సమస్యపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్ల్-2023ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూకాశ్మీర్ సమస్యకు భారత తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని మరోసారి నిందించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) సమస్యకు మాజీ ప్రధాని బాధ్యత వహించాలని అమిత్ షా అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ మూలంగానే పీఓకే సమస్య ఏర్పడిందని లేకపోతే అది భారతదేశంలో భూభాగం ఉండేదని ఆయన చెప్పారు.
Sengol History: మన దేశంలోని కొత్త పార్లమెంటు భవనంలో లోక్‌సభ స్పీకర్ సీటు దగ్గర 'సెంగోల్' రాజదండం (సెంగోల్ చరిత్ర) అమర్చబోతోంది. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అక్కడ ప్రారంభించబోతున్నారు.
మనదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులది కీలక స్థానం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభమయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్కు ప్రధాన మంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రతి యుగంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత సాధికారికంగా, ఆధునికంగా మార్చడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మారుమూల పల్లె నుంచి, పేదరికం నుంచి, రైతు కుటుంబం నుంచి ప్రధాని పదవిని…