V. Hanumantha Rao: దేశంలో జూన్ 5తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ. V.హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదన్నారు. నెహ్రు మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశాన్ని నడిపించాడన్నారు. పంచవర్ష ప్రణాళిక లు నెహ్రు తెచ్చిండని తెలిపారు. దేశంలో డ్యామ్ లు కట్టించింది నెహ్రు నే అన్నారు. మోడీ ఏమి మాట్లాడుతుండో అర్థం కావట్లేదన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మోడీ ప్రైవేట్ చేస్తుండన్నారు. కాంగ్రెస్ ఏమి తెచ్చింది అంటుండ్రు.. కాంగ్రెస్ స్వాతంత్య్రాన్ని తెచ్చిందన్నారు. అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మోడీ మార్చాలని చూస్తున్నారని తెలిపారు.
Read also: CM Revanth Reddy: రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు.. సీఎం రేవంత్ కసరత్తు..
బీజేపీ వాళ్ళు రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు. అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు నరేంద్ర మోడీ హటావ్,దేశాన్ని బచావ్ అంటున్నారని తెలిపారు. దేశంలో జూన్ 5తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. మరోవైపు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నెహ్రు ప్రతిష్టను తగ్గించేందుకు ఆర్ఎస్సెస్, బీజేపీ లు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. పండిట్ జవర్ లాల్ నెహ్రు దేశాన్ని దూర దృష్టితో చూస్తున్నారని తెలిపారు. నెహ్రూను విమర్శించే వాళ్ళను చూసి నిజమైన దేశ భక్తులు ఇప్పుడు బాధ పడుతున్నారని తెలిపారు.
MLC By Election: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్స్ పోలింగ్.. 12 గంటల వరకు 33.19 శాతం