బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు.
READ MORE: Ronald Rose : ఏపీకి కాదు… రోనాల్డ్ తెలంగాణలోనే..! సీనియర్ ఐఏఎస్ అధికారికి ఊరట..
బీజేపీ తమ వ్యవస్థ మీద దాడి చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణాలో కుల గణ అంశంపై స్పందించారు. కులగణనపై మంచి స్పందన వచ్చిందన్నారు. మైనార్టీలు, ఆదివాసులు, గిరిజనుల కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. జాతీయ జన గణన చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. “తెలంగాణలో కుల గణనపై రేవంత్ రెడ్డి నాకు వివరించారు. తెలంగాణలో ఓసీలు, బీసీలు మైనార్టీలు ఎంత అనేది తేలింది. తెలంగాణ లో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. దేశానికే ఆదర్శంగా నిలిచాం. రాష్ట్రంలో ఓబీసీలు, దళితులు, ఆదివాసులకు సరైన ప్రాతినిధ్యం లేదని స్పష్టమైంది. దేశ జనాభాలోని 90 శాతం మంది జనాభాకు సరైన ప్రాతినిధ్యం లేదు. 90 శాతం మంది జనాభా అవకాశాలను లాగేసుకున్నారు. మీరందరూ లేకుండానే “భారత్ జోడో” యాత్ర రాహుల్ గాంధీ చేయగలడా?” అని ప్రశ్నించారు.
READ MORE:CM Chandrababu: పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి.. సీఎం ఆదేశాలు..
మహాత్మ గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, అంబేద్కర్, గురునానక్, కబీర్ ఆలోచనల రూపం భారత రాజ్యాంగం అని రాహుల్ గాంధీ అన్నారు. భారత రాజ్యాంగం 75 ఏళ్ల నాటి పుస్తకంగా భావించరాదని.. వేలాది సంవత్సరాలుగా భారత దేశ ప్రజల ఆలోచన విధానమే “భారత రాజ్యాంగం” అని స్పష్టం చేశారు. రాజస్థాన్ లో సీఎల్పీ నేత దళితుడని.. గుడిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారన్నారు. తమ కార్యకర్తలు దళితులు, ఆదివాసులు అందరికీ గౌరవం ఇస్తారని చెప్పారు.