Bhaag Saale: శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భాగ్ సాలే. వేదాంష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Bhaag Saale: మత్తు వదలరా సినిమాతో శ్రీ సింహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత మనోడి రేంజ్ మారిపోతుందని అనుకున్నారు. కానీ, ఆ సినిమా తరువాత శ్రీసింహాను జనాలు మర్చిపోయారు అనే చెప్పాలి.
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన 'గేమ్ ఆన్' మూవీ సమ్మర్ స్పెషల్ గా రాబోతోంది. సూసైడ్ చేసుకుందామనుకున్న కుర్రాడు రియల్ టైమ్ గేమ్ లోకి అడుగుపెడితే ఏమైందన్నదే ఈ చిత్ర కథ.
గీతానంద్ హీరోగా అతని సోదరుడు దయానంద్ తెరకెక్కిస్తున్న 'గేమ్ ఆన్' మూవీ నుండి రెండో లిరికల్ సాంగ్ విడుదలైంది. అశ్విన్ - అరుణ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ రచన చేశారు.
గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘గేమ్ ఆన్’. ఫిల్మ్ నగర దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్, నేహా సోలంకిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా…
యూత్ ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు ట్రెండ్ గా మారాయి. ఆ ట్రెండ్‌కు తగ్గట్టుగా వస్తున్న సినిమాలు మంచి విజయం సాధిస్తున్నాయి. అలా రాబోతున్న సినిమాల్లో ఛలో ప్రేమిద్దాం కూడా ఒకటిగా నిలుస్తుందని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వరుణ్ సందేశ్‌తో ప్రియుడు లాంటి లవ్ ఓరియంటెడ్ సినిమా నిర్మించిన ఉదయ్ కిరణ్ మాదిరిగానే ఛలో ప్రేమిద్దాం సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నిర్మాత ఉదయ్ కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి…
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి జంటగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ఛలో ప్రేమిద్దాం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. డైరక్టర్ గోపిచంద్ మలినేని వీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోపిచంద్ మలినేని ‘మోషన్ పోస్టర్ నచ్చడంతో లాంచింగ్ కి వచ్చాను. అందరూ నిర్మాత గురించి గొప్పగా చెబుతుంటే నాకు, నా తొలి సినిమా నిర్మాత…
సప్తగిరి హీరోగా ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. కె.ఎం. కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైవిధ్యమైన కథతో ఖర్చుకు రాజీ పడకుండా హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసరాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాతలు…