Bhaag Saale: శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భాగ్ సాలే. వేదాంష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మధ్యనే అస్సలు ఈ సినిమా కథ ఏంటి పాత్రలు ఏంటి అని సిద్దు జొన్నలగడ్డ వివరించిన విషయం తెల్సిందే. ఒక పొలంలో రైతుకు ఒక రాయి దొరకడం.. అది యజమానికి ఇవ్వడం.. అది రాయి కాదని వజ్రమని తెలుసుకొని దాంతో అతను బాగా సంపాదించడమా.. దానికోసం రాజులు పోరాటం చేయడం.. చివరికి ఒక రాజు.. ఆ వజ్రాన్ని 32 ముక్కలు చేసి రాజ్యం మొత్తం పంచడం.. తన దగ్గర ఉన్న ముక్కతో ఒక రింగు చేయించుకొని పెట్టుకోవడం.. అది కాస్తా అతను చనిపోయాక కనుమరుగు అవ్వడం చూపించారు. ఇక ఇప్పుడు ఈ ట్రైలర్ లో ఆ రింగు కోసం హీరో ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడుతుంది అనేది చూపించారు.
Vijay: హీరో విజయ్ పై పోలీస్ కేసు.. ఎందుకంటే ..?
” జమీందార్.. అతని ఫ్యామిలీ గురించి వైవా హర్ష.. విలన్ కు వివరిస్తున్న సీన్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఆ రింగు కోసం విలన్స్ వెతుకుతూ ఉంటారు. ఇంకోపక్క అర్జున్ .. ఒక చెఫ్. రాయల్ ఫ్యామిలీ అయినా రాయల్ గా బతకలేక ఒక హోటల్ ను రన్ చేస్తూ ఉంటాడు. అతనికి ఒక రిచ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అనుకోకుండా ఆ రింగ్ హీరోయిన్ ఇంట్లో ఉంటుంది. ఇక ఆ రింగ్ కోసం హీరో ఎన్ని కష్టాలు పడ్డాడు. అసలు నిజంగానే అర్జున్ వాళ్ళది రాయల్ ఫ్యామిలీనా.. ? ఆ రింగ్ కోసం అర్జున్ ఎందుకు అంత రిస్క్ తీసుకున్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా శ్రీసింహా తండ్రిగా రాజీవ్ కనకాల కామెడీ టైమింగ్ అదిరిపోయింది. వీరి కాంబో థియేటర్ లో నవ్వులు పూయిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివర్లో శ్రీ సింహా, రాజీవ్ కనకాల.. ఆర్ఆర్ఆర్ లోని చరణ్, తారక్ మాస్కులు పెట్టుకొని రింగ్ ను దొంగిలించాడనికి బయల్దేరతారు. ” ఇలా నక్కల్లా దాక్కోడం ఎంత సేపు.. కుంభస్థలం బద్దలు కొడదాం పదా” అంటూ ఆర్ఆర్ఆర్ డైలాగ్ చెప్పడం.. దానికి రాజీవ్ కనకాల.. కుంభస్థలం అంటే ఏంటి అని అమాయకంగా అడగడం ఆకట్టుకొంటుంది. మొత్తానికి శ్రీసింహా చిన్నాన్న సినిమాను ఈ విధంగా వాడుకొని ఫేమస్ అవ్వాలని చూస్తున్నాడు. మరి ఈసారి అయినా ఈ హీరో హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఇక పోతే ఈ చిత్రం జూలై 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.