సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో గ్రూప్-2 అంధ విద్యార్థిని సంజనకు అన్యాయం జరిగింది. గుంటూరు నుంచి కడపకు గ్రూప్ 2 పరీక్ష రాసేందుకు వచ్చిన అంధ విద్యార్థిని సంజన.. సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పరీక్ష రాయలేకపోయింది.
కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్‌లో కుంగిన భవనం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రస్తుతం ఒరిగిన భవనంతో పాటు.. ఆ చుట్టూ ప్రక్కల ఉన్న భవనాలు అన్నింటినీ పర్మిషన్ లేకుండా నిర్మించినవే అని తేలింది. 50 నుంచి 100 గజాల లోపు ఉన్న చిన్న స్థలాల్లో 4, 5 అంతస్తుల నిర్మాణం చేపట్టారు భవన యజమానులు. నిర్మాణ సమయంలో ముడుపులు అందుకుని సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. భవన యజమానులు ఒక్కో అంతస్తుకు అనుమతి తీసుకుని…
ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. తల్లాడ వైద్యుల నిర్లక్ష్యంతోనే తన చిన్నారి మృతి చెందిందని కన్నీరుమున్నీరుగా విలపించారు.
Punjab : పంజాబ్‌లోని ఖన్నాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలు ఇంజిన్ విడిపోయి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ట్రాక్‌పై పనిచేస్తున్న కీమ్యాన్ అలారం ఎత్తడంతో డ్రైవర్‌కు ఈ విషయం తెలిసింది.
విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఇద్దరు డీఈలపై వేటు పడింది. హైదరాబాద్ గచ్చిబౌలి డీఈ గోపాలకృష్ణ, మిర్యాలగూడ డీఈ వెంకటేశ్వర్లు సస్పెన్షన్ అయ్యారు. కాగా.. ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర విద్యుత్ సరఫరాలో గోపాలకృష్ణ నిర్లక్ష్యం బయటపడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి డీఈగా గోపాలకృష్ణ దీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. అయితే ఆయనపై ఇంతకుముందు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన అలానే కొనసాగాడు. కానీ ఈసారి మాత్రం ఆయన చర్యలను…
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి బస్సు కింద పడి మృతి చెందింది. బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో వాడపల్లి శ్రీవల్లి (5) అనే చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన కాగా.. అత్తిలి జేమ్స్ స్కూల్లో…