Khammam: ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో జరిగింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు మృతి చెందిందని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రలు మాట్లాడుతూ.. మల్లవరం గ్రామానికి చెందిన గర్భిణీ దడిపల్లి లావణ్యను ప్రసవం కోసం నిన్న (శనివారం) ఉదయం 10 గంటలకు తల్లాడు మండలం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చామన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో లావణ్య కు డెలివరీ పెయిన్స్ రావడంతో భర్త దాడిపళ్లి అశోక్ స్టాప్ నర్స్ కళావతికి చెప్పాడు. అయినా కళావతి తన మాటలు పట్టించుకోకుండా.. నిర్లక్ష్యం వహిస్తూ ఆమె సెల్ ఫోన్ లో రిల్స్ చూస్తూ కూర్చుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నారుగూడెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు వై.గోపి డెలివరీకై ఆసుపత్రికి వచ్చారు. గోపితో పాటు స్టాఫ్ నర్స్ కళావతి, ఏఎన్ఎం త్రివేణి, ఆశా వర్కర్ ఉమా.. డెలివరీ చేస్తున్న సమయంలో లావణ్యకు పల్స్ రేట్ తగ్గి.. క్రిటికల్ గా మారిందని.. దీంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లాలని చెప్పారు.
Read also: B.Vinod Kumar: కేసీఆర్ అసెంబ్లీ కి వస్తారు..
ఇప్పుడు సగం ప్రసవం చేసిన తరువాత.. ఎలా తీసుకుని వెళ్తామని భర్త అశోక్ కాళ్లవేళ్ల పడ్డా పట్టించుకోలేదని వాపోయాడు. కళావతి యోని నుంచి పసికందు తలభాగంలో కొంతమేరకు బయటకు వచ్చిందని కాపాడాలని కోరిన ససేమిరా అన్నారు. అయితే దీనిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. డాక్టర్ గోపి గంట పాటు శ్రమించి బేబీని బయటికి తీశారు. అయితే అప్పటికే బేబీ ఉమ్ము నీరు తాగి చనిపోయుందని బాధితులు ఆరోపిస్తున్నారు. లావణ్య పరిస్థితి క్రిటికట్ గా మారడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించేందుకు 108 కు కాల్ చేశామని వారు కూడా సహకరించాలేదని వాపోయారు. దీంతో గతిలేక లావణ్య బందువులు ప్రైవేట్ వెహికల్ తో ఖమ్మం లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ఆమెకు వైద్యం చేయిస్తున్నారు. దీనిపై ఖమ్మంలో జిల్లాలో కలకలం రేపింది. ఖమ్మం జిల్లా తల్లాడలో ప్రభుత్వం ఆసుపత్రిలో ఇలాంటివి తరుచూ జరుగుతున్నాయని బాధితులు, స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో కేసు నమోదు చేసుకున్న పోలీలు దర్యాప్తు చేస్తున్నారు.
Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత