వాళ్లకు బాధ్యత లేదు.. కానీ, మనకు ఉంది.. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దాం అని సూచించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బడ్జెట్ సమావేశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన ఉండాలన్నారు.. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని సూచించారు. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలనూ భాగస్వామలను చేస్తాం.. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు.. నమ్మకం పెట్టుకున్నారు.. ప్రజల నమ్మకం మేరకు వారి సమస్యలపై సభలో చర్చించాలి. అర్థవంతమైన చర్చలకు సభ వేదిక…
బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, దివంగత అటల్ బీహార్ వాజ్‌పేయి తనను సీఎం చేశారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఎన్డీయే నుంచి వైదొలిగి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరి రెండుసార్లు తప్పు చేశానని నితీశ్ పునరుద్ఘాటించారు. తాను రెండుసార్లు తప్పుడు వ్యక్తులతో వెళ్లానని, అయితే వారు తప్పు చేస్తున్నారని తేలడంతో మళ్లీ బీజేపీలోకి వచ్చానని అన్నారు. ఇకపై ఎన్డీయేను వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు.
59 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ.. రెండో జాబితా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. 59 మందితో విడుదల చేసిన జాబితాలో జనసేన నుంచి 9 మందికి.. బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కగా.. మిగతా పోస్టులు తెలుగుదేశం పార్టీకి చెందినవారికి దక్కాయి..
సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా స్పందించారు.. సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయి అంటూ మండిపడ్డ ఆయన.. సోషల్ మీడియాలో ఆడబిడ్డల మీద ఇస్తాను సారంగా మాట్లాడుతున్నారు.. వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ తాను ఎన్డీయేలో ఉంటానని తన వైఖరిని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ‘‘మహాగట్‌బంధన్’’లో మళ్లీ చేరబోనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అన్నారు.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 20 శాతం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ.. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పి, చేసి చూపిస్తున్నాం అన్నారు.. 2,245 కోట్ల రూపాయలతో ఎర్రుబాలెం నుండి నంబూరు వరకు రైల్వే లైన్ రావడం సంతోషం అన్నారు..
వైఎస్ జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోరాదని నిర్ణయం తీసుకున్నారు ఎన్డీఏ నేతలు .. తిరుమలకు జగన్ వెళ్లే దారిలో ఎన్డీఏ కూటమి నేతలు శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించారు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీకి జగన్ కారణమని ఎన్డీఎ కూటమి నిరసనకు ప్లాన్ చేసింది.. రాజకీయ బలప్రదర్శనకు వైసీపీ దిగితే దీటుగా సమాధానం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నేతలకు శుభవార్త చెప్పారు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంగళగిరి నిర్వహించిన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దుష్ప్రచారాలని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. మనం చేస్తున్న పనులను చెప్పుకుంటూనే.. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు.. వైఎస్ వివేకా హత్యపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టలేకపోయాం అన్నారు.. ఇక, నామినేటెడ్ పోస్టులు ఉంటాయి..…
Amit Shah: చిన్న పల్లెటూరిలో పుట్టి దేశాని ప్రధాని అయి, దేశానికి గర్వకారణగా నిలిచారని ప్రధాని నరేంద్రమోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఈ రోజు మోడీ పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలతో పాటు మేము కూడా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడి ప్రార్థిస్తున్నామని అన్నారు.