Nitish Kumar: ఎన్డీయేలోనే ఉంటా.. క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్..
- మహాగటబంధన్‌లో చేరి తప్పు చేశా.. భవిష్యత్తులో మళ్లీ జరగదు..
- ఎన్డీయేలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చిన సీఎం నితీష్ కుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: బీహార్ సీఎం నితీష్ కుమార్ తాను ఎన్డీయేలో ఉంటానని తన వైఖరిని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ‘‘మహాగట్‌బంధన్’’లో మళ్లీ చేరబోనని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం అన్నారు. ఉన్నత స్థాయి ఎన్డీయే సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నాయకుడు 2025లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలోనే పోరాడుతామని ప్రకటించారు. మహాగటబంధన్‌తో పొత్తు పెట్టుకోవడంపై మాట్లాడుతూ.. తన పార్టీ సీనియర్ నాయకుల సలహా వల్ల చేసిన తప్పులుగా అభివర్ణించారు. ఆయితే ఆయన ఏ ఒక్కరి పేరు చెప్పలేదు.
Read Also: AP: పేదల ఇళ్ల నిర్మాణానికి స్థల వితరణకు ముందుకొచ్చిన ఓ వృద్ధురాలు.. సీఎం అభినందనలు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా ఎన్డీయే కూటమి 220 సీట్లు గెలుచుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. వ్యక్తిగత పార్టీల కన్నా ఐక్యంగా పనిచేయాలనే ప్రాముఖ్యతని నొక్కిచెప్పారు. పంచాయతీ, బ్లాక్ స్థాయిలో ఇలాంటి సమావేశాలను నిర్వహించడం వల్ల ఎన్డీయే నాయకులు మరింత క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాలని నితీష్ కుమార్ శ్రేణులకు సూచించారు. సమావేశం అనంతరం బీహార్ యూనిట్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో ఎన్డీయే పోటీ చేస్తుందని చెప్పారు. 2020 ఎన్నికల్లో గెలిచే సీట్ల సంఖ్యను అధిగమించాలని ఎన్డీయే ప్రతిష్టాత్మకంగా పెట్టుకుందని దిలీస్ జైశ్వాల్ అన్నారు.
మహాకూటమి బీహార్ ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసిందని, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు సమాచారాన్ని చురుగ్గా ఎదుర్కోవాలని నితీష్ కుమార్ ఎన్‌డిఎ నాయకులను కోరారు. ఎన్డీయే విస్తరణని బలోపేతం చేయడానికి నితీష్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ స్థాయి సమావేశాలతో కూడిన వ్యూహాన్ని వివరించారు. భవిష్యత్తులో కార్యక్రమాలను కూటమి నేతలు సమన్వయంతో, భాగస్వామ్యంతో చేయాలని సూచించారు. బీహార్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!