Rajayasabha: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) అభిమానులకు గుడ్ న్యూస్. తాజాగా జరిగిన ఉప ఎన్నికల నేపథ్యంలో రాజ్యసభలో ఎన్డీయే కూటమికి మెజారిటీ మార్క్ లభించింది. ఈ మెజారితో పార్లమెంటు ఎగువ సభలో ఏవైనా బిల్లులను ఆమోదం పొందేందుకు ఎన్డీయే ప్రభుత్వానికి మార్గం మరింత సుగమం కానుంది. ఇకపోతే, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోటీలో అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక ఈ 12 స్థానాలకు గాను కేవలం నేషనల్…
NDA: పార్లమెంట్ రాజ్యసభకు జరిగిన ఉప ఎన్నికల్లో 12 స్థానాలకు గానూ 9 మంది బీజేపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈ రోజు మెజారిటీ మార్కుని చేరుకుంది. బీజేపీ బలం 96కి చేరుకుంది, కూటమిగా చూస్తే ఎన్డీయే బలం 112కి చేరింది. అధికార కూటమికి ఆరుగురు నామినేటెడ్ ఎంపీలతో పాటు ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది.
నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.. ఇక, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి ఢిల్లీ బాటపట్టనున్నారు.. ఈ రోజు.. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన చేరుకోనున్నారు చంద్రబాబు.. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.
అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో మొదటిగా కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు.. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభంకానుండగా.. రేపు వివిధ జిల్లాల్లో మిగత 99 క్యాంటీన్లను.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
ఏపీ విజన్ డాక్యుమెంట్- 2047 రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. అధికారులతో ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ సమావేశం అయ్యారు.. విజన్ డాక్యుమెంటులో పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించారు..
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై గెజిట్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకిగా పునరుద్ధరిస్తూ గెజిట్ విడుదల చేశారు.. ఇకపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరుతో కార్యకలాపాలు సాగించనుంది హెల్త్ యూనివర్శిటీ యాజమాన్యం.
పార్టీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వినతులు ఎన్ని ఉన్నా... అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నాయన.. గత ఐదేళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు..
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు మాజీ మంత్రి హరి రామజోగయ్య.. ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో టీడీపీ ప్రమోజ్ చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైన పథకాలకు కూడా చోటు కల్పించాలన్నారు.
ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సమీక్ష చేపట్టారు.. ఈ సమావేశానికి సీసీఎల్ఏ జయలక్ష్మి, గుంటూరు కలెక్టర్.. నాగలక్ష్మి, జీఏడీ అధికారులు హాజరు కాగా.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పెషల్ సీఎస్…