బీహార్ సీఎం నితీశ్‌కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని, దివంగత అటల్ బీహార్ వాజ్‌పేయి తనను సీఎం చేశారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఎన్డీయే నుంచి వైదొలిగి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరి రెండుసార్లు తప్పు చేశానని నితీశ్ పునరుద్ఘాటించారు. తాను రెండుసార్లు తప్పుడు వ్యక్తులతో వెళ్లానని, అయితే వారు తప్పు చేస్తున్నారని తేలడంతో మళ్లీ బీజేపీలోకి వచ్చానని అన్నారు. ఇకపై ఎన్డీయేను వీడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. వాజ్‌పేయి మహానుభావుడని కొనియాడారు.
READ MORE: Canada Student Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్‌కి షాక్.. SDS వీసా నిలిపివేత..
భోజ్‌పూర్ జిల్లాలోని తరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం నితీశ్ ఈ విషయాలు చెప్పారు. బీజేపీ అభ్యర్థి విశాల్ ప్రశాంత్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఉప ఎన్నికల్లో ఎన్డీయేను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తన ప్రసంగంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి పాలనను సీఎం తీవ్రంగా టార్గెట్ చేశారు. జంగిల్ రాజ్ అని పిలుస్తున్నారని గుర్తు చేస్తూ.. ఆర్జేడీ కేవలం ముస్లింల ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుని.. మైనారిటీల కోసం ఎలాంటి పని చేయలేదని ఆరోపించారు. తాము అందరి కోసం పని చేస్తామన్నారు. భాగల్‌పూర్ అల్లర్లను గుర్తు చేసిన ముఖ్యమంత్రి నితీశ్.. తాము ఉన్నంత కాలం హిందువులైనా, ముస్లింలమైనా అందరి ఒకే విధంగా చూస్తామన్నారు. తాము పని చేశాం కాబట్టే ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఓట్లు అడుక్కుంటున్నారని తెలిపారు.
READ MORE:India Weather : వాతావరణంపై షాకింగ్ రిపోర్ట్.. ఇప్పటికే 3వేలకు పైగా మరణాలు
అయితే.. ఇటీవల దేశంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల అనంతరం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాజీ మిత్రపక్షమైన ఎన్‌డీఏలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను అక్కడికి ఇక్కడికి వెళ్లనని, శాశ్వతంగా ఎన్డీఏతోనే ఉంటానని స్పష్టం చేశారు. 2005 నుంచి బిహార్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని అన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చర్చలో అన్ని విషయాలు చర్చించుకున్నామని తెలిపారు.