Employees Transfer: ఏపీలో ఉద్యోగుల బదిలీలు.. ఆ రెండు శాఖల్లో ట్రాన్స్పర్స్ లేనట్లే..!
- ఏపీలో ఉద్యోగుల బదిలీలు..
- మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయం..
- ఐదేళ్లు ఒకేచోట చేసిన వారికి బదిలీ తప్పనిసరి..
- ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Employees Transfer: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలను ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఐదేళ్లు ఒకే చోట పని చేసిన వారికి బదిలీ తప్పని సరి చేసింది సర్కార్.. ఈ నెల 31వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేసేయాలని ఆదేశాలు ఇచ్చింది. బదిలీలు జరిగే శాఖలు.. రెవెన్యూ, పంచాయతీ రాజ్, మున్సిపల్, గ్రామ వార్డు సచివాలయాలు, మైనింగ్, సివిల్ సప్లైయస్, దేవదాయ, రవాణ, అటవీ- పర్యావరణం, పరిశ్రమలు, విద్యుత్ , స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల్, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలతో పాటు అన్ని శాఖల్లోని ఇంజనీరింగ్ సిబ్బందికి బదిలీలు కంపల్సరీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
Read Also: CM Siddaramaiah: ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర.. ముడా స్కామ్‌పై కర్ణాటక సీఎం..
Also Read
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
- Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
- TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
- Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
ఇక, టీచర్లు, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు బదిలీలకు దూరంగా ఉన్నారు. ప్రజా సంబంధిత శాఖల ఉద్యోగులకే బదిలీలను కూటమి ప్రభుత్వం పరమితం చేసింది. గిరిజన ప్రాంతాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీల వర్తింపు చేసింది. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు లేదా వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించింది. భార్య భర్తలు ఉద్యోగులైతే.. ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.
Read Also: Viral video: రెజ్లర్ బజరంగ్ పునియా దుశ్చర్య.. జాతీయ జెండా పోస్టర్‌పై కాళ్లు.. నెటిజన్ల విమర్శలు
అలాగే, ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్ బేరర్ల లెటర్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సూచనలు చేసింది. ఆఫీస్ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించింది. ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని స్పష్టీకరణ చేసింది. స్క్రూట్నీ తర్వాత కూడా పరిపాలన పరంగా అవసరమనిపిస్తే.. తొమ్మిదేళ్ల కాల పరిమితి ముగియకున్నా.. ఆఫీస్ బేరర్లను బదిలీలు చేయొచ్చని అని ఏపీ సర్కార్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
-
Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!