Nimmala Ramanaidu: గత విధ్వంస పాలనకు నిదర్శనం ఇరిగేషన్ ప్రాజెక్టులే అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 17 నెలల పాటు పోలవరం ఆలన పాలన లేకుండా చేశారు.. పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం.. పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచీ నాలుగు వేల క్యూసెక్కులు అయినా ఉత్తరాంధ్రకు ఇవ్వాలని సీఎం అన్నారు..
బీసీలను పార్లమెంట్ మెట్లు ఎక్కించిన ఘనత టీడీపీది.. బీసీలకు నూతన పథకాలు ప్రారంభమయ్యాయంటే.. అది టీడీపీ ప్రభుత్వంలోనే.. బీసీలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత చంద్రబాబుది.. దావోస్, అమెరికాలాంటి దేశాల్లో కూడా బీసీలు ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు చేసిన కృషి కారణం అని రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
Perni Nani: డిసెంబర్ 10వ తేదీ నుంచి నా భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు పనులు చేసానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
Collectors Conference: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు, రేపు సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఆరు నెలల ఎన్డీయే ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర ప్రదేశ్ విజన్-2047 డాక్యుమెంట్, కొత్తగా తీసుకొచ్చిన పాలసీల అమలుపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఆరు కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఫీజిబిలిటీ స్టడీ కోసం 1.92 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో మరో ఆరు చోట్ల ఎయిర్ పోర్టులు కట్టాలని ఏపీ సర్కార్ ప్రతిపాదించింది.
Minister Savitha: గుంటూరులో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు మెగా డిఎస్సీ ఉచిత శిక్షణా తరగతులను మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు ప్రభుత్వం అని మరోకసారి నిరూపించిందన్నారు.
AP Deputy CM: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామన్నారు.