రేపు ఢిల్లీలో ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం జరుగునుందని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. ఈ సమావేశానికి 38 పార్టీలు హాజరవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎన్డీయే గ్రాఫ్ బాగా పెరిగిందని తెలిపాడు. దేశంలో మంచి పాలన, దేశాభివృద్ధి ఎన్డీయేతోనే సాధ్యం అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వంలో 9 ఏళ్లలో దేశాభివృద్ధిని అందరూ చూస్తున్నారు.