మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం ఆసక్తికర పరిణామం జరిగింది. అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు. అజిత్ పవార్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారంటూ ఫడ్నవిస్ జ్యోసం చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తిన పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. రాజకీయ పరిస్థితుల మాత్రం ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై మహాయుతి కూటమిలో తీవ్ర పంచాయితీ జరిగింది.
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన శరద్ పవార్ పార్టీకి మరో షాక్ తగిలేటట్టు కనిపిస్తోంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎంపీలు.. మహాయుతి కూటమిలోకి వెళ్లేపోయే సూచనలు కనిపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలవడంపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతి గెలవడంపై మహారాష్ట్ర ప్రజల్లో ఉత్సాహం లేదని, ఆనందం కనిపించడం లేదని శరద్ పవార్ శనివారం అన్నారు. కొల్హాపూర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. Read Also: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్…
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం ఒక పేషెంట్‌కు ఆర్థిక సాయంపై చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు.