మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం చీలికల దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ‘వై’ భద్రతను దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఏక్‌నాథ్ షిండే చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలకు షిండే హాజరు కావడం లేదు. మూడు ప్రభుత్వ కార్యక్రమాలకు డుమ్మా కొట్టారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వంలో ముసలం మొదలైనట్లుగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rekha Gupta: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసిన సీఎం రేఖా గుప్తా
థానే జిల్లాలోని బద్లాపూర్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రారంభోత్సవానికి, చారిత్రాత్మక ఆగ్రా కోటలో మరాఠా రాజు జయంతి వేడుకలకు, అంబేగావ్ బుద్రుక్‌లో శివసృష్టి థీమ్ పార్క్ రెండవ దశ ప్రారంభోత్సవాలకు షిండే హాజరు కాలేదు. ఈ మూడు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు.
గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 230 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే షిండే ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. కానీ అందుకు బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శివసేనకు మొత్తం 44 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎంపీలు ఉన్నారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం