లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతిలో వున్నా సినిమాలను త్వరగా పూర్తిచేసే పనిలో పడింది. కరోనా వేవ్ తో నయన్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అయ్యిపోయాయి. ఇదిలావుంటే, నయన్ కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. నిజానికి చాలాకాలం నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా వీరి పెళ్లి విషయం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచుగా అభిమానులతో చాట్ సెషన్ నిర్వహిస్తున్నాడు విగ్నేష్. అందులో భాగంగా అభిమానులు అడిగే పలు ఆసక్తికర విషయాలకు సమాధానాలు చెప్తున్నాడు. తాజాగా జరిగిన చాట్ సెషన్…