yashashree shinde case: నవీ ముంబైలో 20 ఏళ్ల యశశ్రీ షిండే హత్య కేసు సంచలనంగా మారింది. ఉరాన్ ప్రాంతంలో పొదల్లో ఆమె మృతదేహం కత్తిపోట్ల కలిగిన స్థితిలో దొరికింది. ఈ కేసులో నిందితుడిని కర్ణాటక గుల్బర్గాకు చెందిన దావూద్ షేక్‌గా గుర్తించారు. హత్య జరిగిన 5 రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్‌లు ఈ పర్యటనకు వెళ్లారు. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబైలో మంత్రి నారాయణ బృందం పర్యటించింది.
Building Collapses: మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఇవాళ (శనివారం) మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
Atal Setu Bridge: ముంబైలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అటల్ సేతు వంతెన సూసైడ్ స్పాట్‌గా మారుతోంది. తాజాగా 38 ఏళ్ల ఇంజనీర్ బుధవారం మధ్యాహ్నం అటల్ సేతుపై తన వాహనాన్ని ఆపి, అక్కడ నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Mumbai : దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలోని ఓ ప్రాంతంలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయాందోళన నెలకొంది. నిజానికి నవీ ముంబైలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
మహారాష్ట్రలోని నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండు ఫ్యాక్టరీల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా విస్ఫోటనం జరిగినట్లుగా తెలుస్తోంది.
గతేడాది డిసెంబర్ లో అదృశ్యమైన ఓ మహిళ మృతదేహాన్ని నవీ ముంబై పోలీసులు మంగళవారం గుర్తించారు. ఖర్ఘర్ హిల్ కాంప్లెక్స్‌లోని అటవీ ప్రాంతంలో ఆమె కుళ్లిపోయిన మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడు నుంచి దూరం కావడంతో ఆమెను గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ వార్త కథనం తెలిపింది. మృతురాలు వైష్ణవి (19)గా గుర్తించారు. సియోన్‌లోని ఎస్‌ఐఈఎస్ కాలేజీలో చదువుతోంది. కాగా.. ఆ మహిళ 2023 డిసెంబర్…
Navi Mumbai: మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరుగుతున్నాయి. నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు బరి తెగిస్తూనే ఉన్నారు. వావీవరసలు మరిచి మృగాలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడో చోట బయటపడుతూనే ఉన్నాయి. పరువు కోసం బయటకు రాని కేసులు అనేకం ఉంటున్నాయి.