India vs South Africa: నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం వేదికగా ఈ రోజు మహిళల ప్రపంచ కప్ ఫైనల్ జరగబోతోంది. ఇండియా, సౌతాఫ్రికాలు అత్యుత్తమ ఫామ్‌లో ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదని అంతా భావిస్తున్నారు. భారత్ కప్ గెలవాలని యావత్ భారత్ కోరుకుంటోంది.
భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ నాకౌట్‌లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ రికార్డు ఇదివరకు న్యూజీలాండ్ మెన్స్ జట్టుపై ఉంది. ఆక్లాండ్ వేదికగా 2015 ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 298 రన్స్ కివీస్ ఛేదించింది. ఈ రికార్డును భారత…
దీపావళి రోజున నవీ ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 మంది గాయాల పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
ముంబైలో నీట్ స్కోర్ బాగోతం వెలుగు చూసింది.. నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసింది.. నీట్ స్కోర్ లను తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇద్దరు తల్లిదండ్రుల నుంచి రూ. 90 లక్షల వసూలు చేసినట్లు తెలిసింది. నిందితులు మహారాష్ట్రలోని సోలాపూర్, నవీ ముంబైకి చెందిన సందీప్ షా, సలీం పాటిల్ ను అరెస్ట్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కల్పిత అధికారులతో సంబంధాలు ఉన్నాయని…
Gun Firing: నవి ముంబైలోని సంపాదలోని డిమార్ట్ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి 5-6 రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రజలకు తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో అక్కడున్న ప్రజల్లో భయాందోళన నెలకొనగా.. గాయపడిన వ్యక్తిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని…
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ కారులో కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్ కాస్మెటిక్ సర్జన్‌గా గుర్తించారు. అజాగ్రత్తగా వాహనం నడిపిన అతడిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న మరికొందరు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..
Maharshtra: దీపావళి అలంకరణ విషయంలో ముస్లిం వ్యక్తులు అభ్యంతరం తెలుపుతున్న వీడియో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. మహారాష్ట్ర నవీ ముంబైలోని పంచానంద్ సొసైటీలోని ఈ ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైంది.
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో జనాలకు చుక్కలు కనిపించాయి.
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి.