Railway Station turns into Swimming Pool: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి.. ఈశాన్య రుతుపవనాలు విస్తరించినా.. వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురుస్తున్నాయి.. కానీ, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి.. ఇక, ముంబైలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి.. ఆగకుండా కురుస్తున్న వానలకు నవీ ముంబైలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్‌లోకి నీళ్లు చేరాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది ఏమైపోయింది అంటై ఆశ్చర్యం వ్యక్తం చేసేలా పరిస్థితి మారిపోయింది.. అయినా వదిలేస్తామా ఏంటి..? ఓ వైపు వర్షం వస్తున్నా.. మరోవైపు రైల్వే స్టేషన్‌లోకి నీరు చేరుతున్నా.. స్థానిక యువకులు మాత్రం.. అక్కడ నీటిలో జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఆ దృశ్యాలకు కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో.. వైరల్‌గా మారిపోయాయి..
Read Also: Akbaruddin Owaisi: నన్ను చంపాలని చూసిన వారిని క్షమిస్తున్నా: ఓవైసీ హాట్ కామెంట్స్
ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదనీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నవీ ముంబైలోని ఉరాన్ లోకల్ రైల్వే స్టేషన్ అయితే, స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తూ నిండుగా నీళ్లు చేరాయి. దీంతో యువత అందులో హాయిగా జలకాలాడారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన పనులు ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నారే విమర్శలు కూడా ఉన్నాయి.. ఉరాన్ రైల్వే స్టేషన్ నుంచి ఇదే పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఉరాన్ రైల్వే స్టేషన్ నాసిరకమైన పని వెలుగులోకి తెచ్చాయి భారీ వర్షాలు.. వర్షం కారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున నీరు చేరింది. నిలిచిన నీటిలో ఈత కొడుతూ ఆనందించారు యువకులు.. ఖార్కోపర్ నుండి ఉరాన్ లోకల్ రైలు ప్రారంభం కాకముందే ఉరాన్ రైల్వే స్టేషన్ వరదలతో నిండిపోయింది. గతంలో స్టేషన్‌లో ‘కబ్ ఆవోగే’ పాటలు పాడి రైల్వే సర్వీసులను ప్రారంభించాలంటూ మహిళలు డిమాండ్ చేశారు.
Read Also: Pakistan: వ్యాన్‌లో పేలిన గ్యాస్ సిలిండర్, ఏడుగురు దుర్మరణం.. విచారణకు ఆదేశించిన సీఎం
వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉరాన్, ద్రోణగిరి స్టేషన్లు రెండూ గత వారం రోజులుగా అంధకారంలో ఉన్నాయి. ఈ విషయమై రైల్వే శాఖను సంప్రదించగా.. ఈ రెండు స్టేషన్ల విద్యుత్ పనులు టెస్ట్ చేస్తున్నాం.. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. ఉరాన్ రైల్వేస్టేషన్ ఇప్పుడే చెరువులా మారిపోతే.. భారీ వర్షాలు కురిస్తే ఇక ఈ రైల్వేస్టేషన్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది..
नवीन नेरूळ – उरण लोकल रेल्वे स्टेशन
बोकडविरा @CMOMaharashtra @PMOIndia @AshwiniVaishnaw @Dev_Fadnavis @mieknathshinde #uran_local_navi_mumbai pic.twitter.com/mb0Wp5fF1j— Jeetendra N. Thale (@JeetendraThale) July 4, 2023