ఏపీ వ్యసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి టీడీపీ, జనసేన అధినేతలపై విరుచుకుపడ్డారు. కోనసీమలో క్రాప్ హాలీడే గురించి ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు రాష్ట్ర ప్రజలు రాజకీయ హాలీడే ఇచ్చారని ఎద్దేవా చేశారు. వీళ్ళు క్రాప్ హాలీడే అని దుష్ప్రచారం చేస్తున్నారు.సీఎం పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నవరత్నాల్లో మొదటి హామీ రైతు భరోసా. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఉద్యమాలు చేస్తే అణచి వేశారు. కరువు మండలాలు టీడీపీ హయంలోనే ఎక్కువగా…
ఏపీలో పెరిగిపోతున్న అప్పులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు. దేశంలో అవినీతి ఎక్కువగా పెరిగి పోయింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైనికులు ఆయుధాల్లో కూడా అవినీతి చేశారు. అలాంటి సమయంలో 105 ఎంపీల చేత రాజీనామలు చేయించి కాంగ్రెస్ కి తెలుగు వాళ్ల సత్తా ఏంటో చూపించిన వ్యక్తి ఎన్టీఆర్. జైల్లో ఉన్న నేరస్థుడ్ని ముఖ్యమంత్రిని చేశారు. రూ.43 వేల కోట్లను మింగిన వ్యక్తికి అధికారం అప్పజెప్పారు. భావి తరాలపైన కూడా…
ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. తాజాగా జగన్ ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల అప్పు చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్లను వైసీపీ ప్రభుత్వం వేలం వేసింది. వెయ్యి కోట్లు 8 సంవత్సరాల కాలానికి 7.63 శాతం వడ్డీతో వేలం వేసింది. మరో వెయ్యి కోట్లకు ఐదు సంవత్సరాల కాలానికి 7.46 శాతం వడ్డీతో బాండ్ల వేలం జరిగింది. గత వారం రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు రుణాన్ని…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు పార్టీ పెద్దలు. అతి కొద్ది కాలంలోనే మనం అధికారంలోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో…