Telangana Chief Minister K.Chandra Shekar Rao Are Going to National Politcis. జాతీయ రాజకీయాల పట్ల తన తాజా ఆలోచనలను టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ ప్లీనరీ సందర్భంగా శ్రేణులతో పంచుకున్నారు. ఢిల్లీ పాలిటిక్స్‌పై ఆయన మాటలు గతంలో కంటే ఇప్పుడు కాస్త భిన్నంగా ఉన్నాయి. సందర్భం వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ గురించి మాట్లాడే ఆయన ఈసారి దాని గురించి ప్రస్తావించలేదు. పైగా ఫ్రంట్…
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ కాదని, దక్షిణాదిలో బీజేపీ లేదని ఆయన అన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఉందా అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏదో పొరపాటున 4 ఎంపీ సీట్లు గెలిచారన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ చిల్లర రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అని,…
దేశరాజకీయాలు మార్చేస్తా.. బీజేపీయేతర ఫ్రంట్ దిశగా అడుగులు వేద్దాం అంటూ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంతనాలు జరుపుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారా? అంటే అవుననే అనిపిస్తోంది. ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయం హాట్ టాపిక్ అవుతోంది. శనివారం ఉదయం నుంచి ప్రగతి భవన్ లోనే ప్రశాంత్ కిషోర్ వున్నట్టు తెలుస్తోంది. ఆదివారం కూడా ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్…
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో రాంచీలో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి సరికొత్త దశ, దిశ కోసం ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొత్త పంథాలో, కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మద్దతు పలికారని.. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఈరోజు శిబూ…
2023 కి ముందే దేశంలో మరో ఫ్రంట్ రాబోతోందా? తెలంగాణ దానికి వేదిక కాబోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో వున్నారు. వీరందరి సమావేశానికి ముహూర్తం ఖరారైందా ? అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రాంతీయ పార్టీల భేటీ జరిగే అవకాశం ఉందా ? ప్రాంతీయ పార్టీల సమావేశంకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా ? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరంలో ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడటం, ఆయన ముంబై పర్యటన, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో గంటసేపు లంచ్ మీటింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో మాటా మంతీ జరిపారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు ఎంతవరకు ఫలిస్తాయి? ప్రాంతీయ పార్టీలు ఏకం కావటం సాధ్యమా? జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలన్న తన…
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయంగా ఇప్పుడు తన ఆరాధ్యుడు నందమూరి తారక రామారావును గుర్తుచేస్తున్నారు. ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1983లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయం సాధించింది. అదే ఏడాది మే 28న తన పుట్టిన రోజు నాడు విజయవాడలో విపక్షాలతో మహా రాజకీయ సదస్సు నిర్వహించారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక ఐక్యకూటమి ప్రయత్నాలకు అది మరో ఆరంభం. 1983లోనే కర్నాటకలో రామకృష్ణ హెగ్డే సారధ్యంలో జనతా పార్టీ ప్రభుత్వం…
ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. ఇతర పక్షాలను కూడా కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇక, ఇవాళ బంగారు భారత దేశాయాన్ని తయారు చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు కేసీఆర్.. నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన ఆయన.. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యాలు…
ముంబై పర్యటనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశం ప్రస్తుతం…
ముంబై పర్యటనలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయాలపై మహారాష్ట్ర సీఎంతో చర్చించినట్లు తెలిపారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకు మహారాష్ట్ర వచ్చానని.. దేశంలో మార్పులు రావాల్సి ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చర్చలు ఆరంభం మాత్రమే అని సీఎం…