CM KCR: దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత.. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై పర్యటనలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. 1969 ఉద్యమ సమయం నుంచి శరద్ పవార్ తెలంగాణకు మద్దతు ప్రకటించారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అతి చిన్న వయసులోనే సీఎంగా పాలన సాగించిన ఘనత శరద్ పవార్‌ది అని కొనియాడారు. దేశంలోనే శరద్ పవార్ సీనియర్ నేత అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
దేశం ప్రస్తుతం సరైన మార్గంలో నడవడం లేదని.. దళితుల వికాసం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత కూడా దేశంలో సరైన పాలన లేకపోవడం దురదృష్టకరమన్నారు. అందుకే దేశం కోసం.. సరైన అజెండా రూపొందించాలన్నారు. దేశంలోనే అత్యంత అనుభవం ఉన్న నేత శరద్ పవార్ అని… ఖచ్చితంగా ఆయన తమతో కలిసి పనిచేస్తా అన్నారని కేసీఆర్ చెప్పారు. ఇంకా ఇతర నేతలతో కూడా మాట్లాడి ముందుకు వెళ్తామని… అందరినీ కలుపుకొని వెళ్తామన్నారు. తమ కార్యచరణ ఏంటో త్వరలోనే తెలియజేస్తామని కేసీఆర్ తెలిపారు.
Also Read
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
దేశ రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడిందని.. సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశాభివృద్ధి గురించే ఎక్కువగా కేసీఆర్‌తో చర్చించామని.. భవిష్యత్‌లోనూ కేసీఆర్‌ను కలిసి ఇంకా చాలా విషయాలు చర్చిస్తామన్నారు.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!