Congress Party President: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ ప్రక్రియ పూర్తికావాలి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ ఓటమి తర్వాత రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు.
KCR to go Bihar: బీహార్‌లో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ఆ రాష్ట్రానికి వెళ్లాలని టీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన నిన్న మంగళవారమే నిర్ణయం తీసుకున్నారని వార్తలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్‌తో సమావేశమయ్యారు.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దేశం కోసం ఎలా పోరాడబోతున్నానో వివరించారు. అది ఆయన మాటల్లోనే.. ‘నేను బీజేపీ, కాంగ్రెస్, చంద్రబాబు, సీపీఐ వంటి పార్టీలతో జైతెలంగాణ అనిపించలేదా. అదీ కేసీఆర్ అంటే. నేను దేశం కోసం పోరాటం మొదలుపెట్టబోతున్నా. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే అందరూ నాతో వస్తారు. బీజేపీని ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయను. వాళ్ల తప్పులు వాళ్లే పెంచుకునే దాక చూస్తా. వాళ్లకు ఇంకా అహంకారం పెరగాలి. నేను ఎవరికీ భయపడను. ఒకరో…
తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్ధించానని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇవాళ (జూన్ 13న) ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్ కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి…
దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా దేశవ్యాప్త పర్యటనలకు మళ్ళీ రెడీ అయ్యారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన కేసీఆర్ ఈసారి కర్నాటక పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్… రేపు బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. రేపు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్…
జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్.. కేరళ సీఎం పినరాయ్ విజయన్.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. జార్కండ్ సీఎం హేమంత్ సొరేన్‌లను కలిసి జాతీయ రాజకీయాలు.. 2024 సార్వత్రిక ఎన్నికల గురించి చర్చించారు. ఇటీవల జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలని స్పష్టం చేశారు గులాబీ దళపతి. ఈ చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజకీయ…