Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే విజయవాడలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేసే అరుదైన అవకాశం తనకు వచ్చిందన్నారు. తాను ఇప్పటికే పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా ఉన్నానని.. సుదీర్ఘ కాలం పాటు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం చేశానని తెలిపారు. 2009లో సోనియా గాంధీ సూచనల మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశానని.. కేంద్ర కార్మిక శాఖ, సోషల్ జస్టిస్ మంత్రిగా…
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌లు కలిశారు. ఢిల్లీలోని సోనియా నివాసంలో నేతలు ఆమెను కలిశారు. జాతీయ రాజకీయాలు, విపక్ష పార్టీల ఐక్యతపై చర్చించినట్లు తెలుస్తోంది.
దేశంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు సహా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీష్ కుమార్ కోరారు. ఈ "ప్రతిపక్షాల ప్రధాన ఫ్రంట్" 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ ఘోరంగా ఓడిపోయేలా చేస్తుందని ఆయన అన్నారు.
Kumaraswamy met with KCR: జేడీయూ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలపై ఇరు నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఇద్దరు నేతలు ప్రగతి భవన్ లో లంచ్ చేయనున్నారు. ఆ తరువాత సాయంత్ర 5 గంటల వరకు ఇరు నేతల మధ్య చర్చలు జరగనున్నాయి. కేసీఆర్ కొత్తగా జాతీయ పార్టీ పెడుతారనే చర్చ…
జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరి నేతల మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.