Onion Export: పెరుగుతున్న ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై శనివారం ఆంక్షలు విధించింది. సరఫరా, ధరలపై ఒత్తిడి మధ్య కూరగాయల విదేశీ ఎగుమతులపై కనిష్ట ధరను నిర్ణయించింది. కనిష్ట ఎగుమతి ధర(MEP) టన్నుకు 800 డాలర్లగా అక్టోబర్ 29 నుంచి అమలులోకి వస్తుందని,
ప్రజల సొంతింటి కల ఎంతలా ఉంటుందనే దానికి పూణేలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల పూణేలోని నివాసితులు రూ. 1.5-2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు ఏకంగా 8 గంటలు క్యూలో నిల్చుకున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాద్ ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gujarat: ఎంతటి కష్టం వచ్చిందో.. ఒకే కుటుంబంలోని 7గురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటు చేసుకుంది. ఘటన స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రోజ్‌గార్ మేళా 2023లో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు 51 వేల మంది యువతకు నియామక పత్రాలను అందజేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపాధి మేళాను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటనలు చేయడమే కాకుండా పని చేస్తుందని అన్నారు.
2వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వర (బసవన్న) పేరు మీదుగా విజయపుర జిల్లా పేరును మార్చాలని డిమాండ్‌లు ఉన్నాయని కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ శుక్రవారం అన్నారు. కర్ణాటక రాష్ట్రం మొత్తాన్ని 'బసవ నాడు' (బసవ భూమి)గా మార్చడంలో తప్పు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో భార్యభర్తల గొడవ కొడుకును నేరస్తుడిగా మార్చింది. తన తల్లిని బలవంతంగా ఇంటి నుంచి వెళ్లగొట్టాడనే కోపంతో తండ్రిని హత్య చేశాడు ఓ బాలుడు. ఈ ఘటన జార్ఖండ్ లోని పాలము జిల్లాలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీస్ అధికారులు శుక్రవారం తెలిపారు.
డిసెంబర్ 5 వరకు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో తమ ప్రతిపాదిత ‘విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర’ చేపట్టవద్దని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తమిళనాడు రాజ్‌భవన్ వద్ద పెట్రోల్ బాంబు విసిరిన ఘటన కలకలం రేపిన విషయం విదితమే. చెన్నైలోని రాజ్‌భవన్ ప్రధాన గేటు వద్ద ఓ వ్యక్తి పెట్రోల్ సీసాను విసిరేశాడు. ఈ క్రమంలో ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు భారత ఆర్మీ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.