Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఈయన గురించి పరిచయం అవసరం లేదు.. బాలనటుడిగా సినీ తెరంగేట్రం చేసిన అయన ఆపై కన్నడ పవర్ స్టార్ గా ఎదిగారు. ఆయన్ని అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. నటన లోనే కాదు మానవత్వాన్ని చాటుకోవడం లోనూ ఆయనకు ఆయనే సాటి. వందలాది మంది అనాథలను చేరదీసిన మనసున్న మహారాజు.. గోశాలలను ఏర్పాటు చేసి మూగజీవుల ఆకలి తీర్చిన గొప్ప మానవతావాది. కనడ ప్రజల ఆరాధ్య దైవం పునీత్ రాజ్ కుమార్. మంచి వాళ్ళను ముందుగానే తీసుకుపోతాడు ఆ దేవుడు అని మన పెద్దలు అన్నట్లు.. ప్రజలకు ఎన్నో సేవలు అందించిన పునీత్ అతి చిన్న వయసు లోనే మరణించారు. ఆయన మరణం కనడ నాడునే కాదు యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచింది.
Read also:Hyderabad: చంపాపేట్ స్వప్న హత్య కేసులో ట్విస్ట్.. బయటపడిన సంచలన నిజాలు
అయన 2021 అక్టోబర్ 29న గుండెపోటుతో మరణించారు. ఈ రోజుకి పునీత్ మనల్ని వదిలి వెళ్లి రెండు సంవత్సరాలు అవుతుంది. అయినా నేటికీ ఆయన ప్రజల మనసులో నిలిచే ఉన్నారు. మరణించి కూడా ప్రజల మదిలో నిలిచిన ఆయన మరణాన్ని జయించిన అమరుడు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా అభిమానులు అయన పేరు మీద సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్లు పెడుతున్నారు అభిమానులు. అయన సంపాదించుకున్న కీర్తికి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు అనడానికి ఓ ఉదాహరణ..
Read also:Health Tips: మారుతున్న వాతావరణంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతారు.. ఈ పనులు చేస్తూ ఉండండి
పునీత్ చనిపోయే నాటికి ఆయన నటించిన రెండు సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఆ చిత్రాలు విడుదల కాకముందే అయన మనల్ని వదిలి వెళ్లారు. అయితే అయన పైన ఉన్న అభిమానంతో ప్రజలు, కనడ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు పునీత్ రెండు సినిమాలు విడుదల అయ్యేవరకు ఏ ఇతర హీరోల సినిమాలు విడుదల చేయకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానుసారం పునీత్ నటించిన రెండు సినిమాలు విడుదలైన తరువాతనే మరల ఇతర హీరోలు నటించిన సినిమాలు విడుదల చేశారు. పునీత్ తన మంచి మనసుతో రీల్ హీరోగా గుర్తుండడమే కాదు రియల్ హీరోగా ప్రజల మనసుల్లో నిలిచే ఉంటారు.