జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఓ పోలీసును ఉగ్రవాదులు అతని ఇంటిలోనే కాల్చిచంపారు. లోయలో గత మూడు రోజుల్లో ఇది మూడో లక్షిత దాడి కావడం గమనార్హం. బారాముల్లాలోని కరల్‌పోరా గ్రామంలోని కానిస్టేబుల్ గులాం మహ్మద్ దార్ ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
పలు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్ ఐడీ ఆధారంగా స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ తమ ఐఫోన్, ఈ-మెయిల్స్ హ్యాక్ చేస్తున్నట్లు యాపిల్ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు మహారాష్ట్రలో శరవేగంగా వ్యాపిస్తోంది.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పలు వరుస పేలుళ్లకు బాధ్యుడని పేర్కొన్న డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, పేలుడు పదార్థాల చట్టం, హత్యా నేరాల కింద అతడిని సోమవారం అరెస్టు చేశారు.
బాలీవుడ్ రాపర్ బాద్‌షా సోమవారం మహారాష్ట్ర సైబర్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఫెయిర్‌ప్లే అనే బెట్టింగ్ యాప్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మ్యాచ్‌లను వీక్షించడాన్ని ప్రోత్సహించినందుకు వయాకామ్ 18 నెట్‌వర్క్ రాపర్ బాద్‌షా, నటుడు సంజయ్ దత్‌తో సహా 40 మంది ఇతర నటులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది.
Gujarat: శనివారం గుజరాత్ సూరత్ లోని శ్రీ సిద్ధేశ్వర్ కాంప్లెక్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. కాగా ఘటన స్థలంలో విషం బాట్టిల్ తో పాటుగా సూసైడ్ లెటర్ దొరకడంతో అందరూ అది సామూహిక ఆత్మహత్యగా భావించారు. అయితే తాజాగా ఆ ఘటనకు సంబందించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా అసలు నిజాలు వెలుగు చూశాయి. అందరూ భావించినట్లు కుటుంభం సభ్యులు అందరూ కలిసి సామూహిక…
Kerala Bomb Blasts: కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు ఉదయం ఒక మతపరమైన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. 45 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రార్థనా సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై ఎన్ఐఏతో పాటు కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఈయన గురించి పరిచయం అవసరం లేదు.. బాలనటుడిగా సినీ తెరంగేట్రం చేసిన అయన ఆపై కన్నడ పవర్ స్టార్ గా ఎదిగారు. ఆయన్ని అభిమానులు అప్పు అని ముద్దుగా పిలుచుకుంటారు. నటన లోనే కాదు మానవత్వాన్ని చాటుకోవడం లోనూ ఆయనకు ఆయనే సాటి. వందలాది మంది అనాథలను చేరదీసిన మనసున్న మహారాజు.. గోశాలలను ఏర్పాటు చేసి మూగజీవుల ఆకలి తీర్చిన గొప్ప మానవతావాది. కనడ ప్రజల ఆరాధ్య దైవం పునీత్…
Odisha: మనలో చాల మంది నిత్యం ఏదో ఒక చోటుకి ప్రయాణిస్తుంటారు. అయితే ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్య స్థానానికి చేర్చాల్సిన బాధ్యత ఆ వాహనాన్ని నడిపే డ్రైవ్ పైనే ఉంటుంది. కొన్ని సార్లు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలను పణంగాపెట్టి ప్రయాణికుల్ని కాపాడుతుంటారు డ్రైవర్ లు. అయితే తాజాగా ఓ బస్సు డ్రైవర్ తను చనిపోతూ కూడా బస్సు లోని ప్రయాణికుల్ని రక్షించాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. సనా ప్రధాన్ అనే వ్యక్తి…