Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం నాడు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఇదివరకే నగరంలోని 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌కు పంపిన ఇమెయిల్‌లో ఆవరణలో బాంబు పేలుడు సంబంధిత విషయం ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు నివేదించాయి. ఆదివారం (అక్టోబర్ 27) లక్నోలోని 10 హోటళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే,…
పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం మాజీ ఎమ్మెల్యే తన్మయ్ భట్టాచార్యపై ఒక మహిళా జర్నలిస్టు సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే తన ఒడిలో కూర్చున్నారని మహిళా జర్నలిస్టు ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత, సీపీఎం పార్టీ నాయకుడు తన్మయ్ భట్టాచార్యను ఆదివారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రకటించింది.
* మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నేటి పర్యటన వివరాలు.. ఉదయం 10 మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 5 గంటలకు తూర్పు నాయుడుపాలెం I.O.C దామచర్ల సత్య కార్యాలయంలో జరిగే కొండపి నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. * ప్రకాశం : గిద్దలూరులో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నా.. * ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టు…
Lucknow Hotels Bomb Threats: లక్నోలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి. ఇందులో హోటల్ ఫార్చ్యూన్, హోటల్ లెమన్ ట్రీ, హోటల్ మారియట్ సహా 10 పెద్ద హోటళ్ల పేర్లు ఉన్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా హోటళ్లను బాంబులతో బెదిరించారు. అంతకుముందు కూడా బాంబు పేలుస్తామని బెదిరిస్తూ అగంతకులు పాఠశాలలకు ఇలాంటి మెయిల్స్ పంపారు. ఈ హోటళ్లలో బాంబుల నివేదికల మధ్య, ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానాలకు సంబంధించి కూడా పెద్ద…
* ఢిల్లీ: విభజన సమస్యలపై నేడు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో జరగాల్సిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం వాయిదా * నేడు సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన * హైదరాబాద్: నేడు రాష్ట్రానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్.. పలు కమిటీలతో విడి విడిగా భేటీ కానున్న బన్సల్.. ఎమ్మెల్సీ ఎన్నికలు , అభ్యర్థుల పై చర్చ * ఆదిలాబాద్: నేడు జిల్లాకు బీఆర్ఎస్…
Train Incident: బీహార్లోని పూర్నియా జిల్లాలోని రాణిపాత్ర రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం అర్థరాత్రి, కతిహార్ నుండి జోగ్బానీకి వెళ్తున్న DMU రైలు చక్రానికి ఓ ఇనుప రాడ్ చిక్కుకోవడంతో ఘటన జరిగింది. అయితే, లోకో పైలట్ చాకచక్యంతో రైలు ఆగిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన తర్వాత స్థానిక రాణిపాత్ర స్టేషన్ అడ్మినిస్ట్రేషన్, ఇతర రైల్వే అధికారులతో పాటు GRP ఫోర్స్ రావడంతో రాడ్…