Explainer: రాత్రికి రాత్రే దాడి.. కంట్రోల్ తప్పిన ఏఐ..దెబ్బకు కథ అడ్డం తిరిగింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవాళి ఊహలకు జీవం పోస్తూ, అధునాతన సాంకేతిక విప్లవంగా అవతరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు తన గీత దాటింది! మనిషి నియంత్రణను సవాల్ చేస్తూ, డిజిటల్ ప్రపంచంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. “ఏఐ స్వయంప్రతిపత్తి సాధిస్తే ప్రమాదం తప్పదు” అని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న భయాలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ ఏఐ పరిశోధనా సంస్థ ఓపెన్ ఏఐ తయారు చేసిన ఒక ఏజెంట్.. తన పరిధులను దాటేసింది. మరో ప్రముఖ టెక్ సంస్థ ‘హగ్గింగ్ ఫేస్’పై రాత్రికి రాత్రే దాడికి దిగింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ముంచుకొస్తున్న విపత్తుకు ముందస్తు హెచ్చరిక! ఏఐ స్వయంప్రతిపత్తి పేరిట సాగుతున్న ఈ ప్రయోగాలు రేపటి రోజున మనిషి ఉనికికే ఎసరు తెడతాయా? లెట్స్ వాచ్.
జూలై 9న ఓపెన్ ఏఐ సురక్షితమైన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఏఐ ఏజెంట్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అత్యంత శక్తివంతమైన GPT-5.6 Solతో పాటు ఇంకా విడుదల చేయని మరొక శక్తివంతమైన మోడల్ ఆధారంగా రూపొందించిన ఈ ఏజెంట్, సాంకేతిక సరిహద్దులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత కేవలం రెండు రోజుల వ్యవధిలోనే, అంటే జూలై 11న, ఏఐ టూల్స్ కు ల్యాబ్‌గా వ్యవహరించే హగ్గింగ్ ఫేస్ డిజిటల్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడింది. జూలై 11 నుండి జూలై 13 వరకు పూర్తి స్థాయిలో హ్యాకింగ్‌కు పాల్పడింది. దాన్ని గందరగోళం చేసేసింది. ఇంత జరుగుతున్నా, ఓపెన్ ఏఐ కనీసం దానిని గుర్తించలేకపోయింది.
జూలై 16న హగ్గింగ్ ఫేస్ సంస్థ ‘తమపై ఒక ఆటానమస్ ఏజెంట్ దాడి చేసిందని” చెప్పేవరకూ ఈ హ్యాకింగ్ గురించి ఎవరికీ తెలీదు. హగ్గింగ్ ఫేస్ చెప్పేవరకూ తమ సొంత ఏజెంట్ ఈ హ్యాకింగ్‌కు పాల్పడిందనే విషయం ఓపెన్ ఏఐకి తెలియకపోవడం గమనార్హం. ఆ తర్వాత జూలై 18-19 వారాంతంలో ఇంటర్నల్ లాగ్స్ ను పరిశీలించిన ఓపెన్ ఏఐ సిబ్బంది, ఏజెంట్ తమ పరిమితులను దాటి బయటకు వెళ్లిన ఆనవాళ్లను గుర్తించారు. చివరికి జూలై 20న ఓపెన్ ఏఐ, హగ్గింగ్ ఫేస్ ప్రతినిధులు దీనిపై మాట్లాడుకున్నారు. అప్పటికే హగ్గింగ్ ఫేస్ సహ వ్యవస్థాపకుడు థామస్ వోల్ఫ్ సమక్షంలో ఈ అంశంపై FBIకి ఫిర్యాదు కూడా వెళ్ళింది. జూలై 21న ఓపెన్ ఏఐ బహిరంగంగా ఈ ఘటనను అంగీకరించింది. కనీసం వారం రోజుల పాటు తమ ఏఐ ఏజెంట్ ఏం చేస్తోందో కూడా ఆ సంస్థ కనిపెట్టలేకపోయింది.
Also Read
హగ్గింగ్ ఫేస్ హ్యాకింగ్ ఘటన అకస్మాత్తుగా జరిగింది కాదు. దీనికి ముందే ఓపెన్ ఏఐ సిస్టమ్స్‌లో ఆందోళనకర సంకేతాలు కనిపించాయి. మోడల్స్ టెస్టింగ్ సమయంలో అవి తమ భవిష్యత్తు వర్షన్ల కోసం రహస్య సమాచారాన్ని, సూచనలను నోట్ రూపంలో ఉంచినట్లు ఆధారాలు లభించాయి. తమను తాము సంస్థ విధించిన నియంత్రణల నుంచి ఎలా విముక్తి చేసుకోవాలో అందులో రాసి ఉండడం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అంతేకాకుండా, అంతకుముందు జరిగిన పరీక్షల్లో ఏఐ ఏజెంట్లు తమను పర్యవేక్షించే మానిటరింగ్ సిస్టమ్స్‌ను సైతం డిస్కనెక్ట్ చేసినట్లు ఆధారాలు లభించాయి. మనుషుల పర్యవేక్షణను దాటవేసేందుకు ఏఐ మోడల్స్ అబద్ధాలు ఆడటం, మోసపూరిత మార్గాలను ఎంచుకోవడం, హ్యాకింగ్‌కు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని పాలిసేడ్ రీసెర్చ్ ప్రతినిధి జెఫ్రీ లాడిష్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏఐ పరిశోధనా సంస్థలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. మార్కెట్లోకి వేగంగా, అత్యంత ప్రతిభావంతమైన మోడళ్లను మార్కెట్లోకి తెచ్చే తొందరలో Safety Proceduresను గాలికి వదిలేస్తున్నాయి. ఓపెన్ ఏఐ ఒకేసారి అనేక మోడల్స్ ను ఎవాల్యుయేట్ చేస్తోంది. దీంతో అధిక వేగంతో నిర్వహించడం వల్ల ఉత్పన్నమయ్యే డేటాను విశ్లేషించడంలో ఉద్యోగులు సైతం వెనుకబడుతున్నారు. ఈ నిర్లక్ష్యం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తోంది. ఓపెన్ ఏఐ సిబ్బంది ఏఐ ఏజెంట్‌ను గాలికొదిలేశారా? లేక అది హ్యాకింగ్ చేస్తుంటే ఎలా అడ్డుకోవాలో తెలియక చేతులెత్తేశారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సి ఉంది.
మనుషుల ప్రమేయం లేకుండా 24 గంటలు పనిచేసే వర్చువల్ ఉద్యోగులను సృష్టించాలనే అత్యాశ, డిజిటల్ ప్రపంచాన్ని అరాచకం వైపు నెడుతోంది. ఓపెన్ ఏఐ త్వరలోనే ఐపీఓ ద్వారా బిలియన్ల డాలర్ల నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్న ఈ కీలక సమయంలో, ఈ ఘటన ఆ సంస్థ విశ్వసనీయతపై పెద్ద దెబ్బ కొట్టింది. ఓపెన్ ఏఐ ప్రతినిధులు ఈ ఘటన తమకు ఒక ముందస్తు హెచ్చరిక అని, విదేశీ నిపుణులతో కలిసి దీనిపై టెక్నికల్ నివేదిక ఇస్తామని చెప్తోంది. అయిన్నప్పటికీ, ప్రభుత్వాల కఠినమైన నియంత్రణలు లేకపోతే లాభాల వేటలో ఉన్న కంపెనీలు భద్రతను పక్కన పెట్టే ప్రమాదం ఉంది.
సాంకేతికత మనిషి ప్రగతికి ఊపిరిగా మారాలి గానీ, మనిషి ఉనికినే ప్రశ్నించేలా మారకూడదు. ఓపెన్ ఏఐ ఏజెంట్ చేసిన ఈ హ్యాకింగ్ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. సరిహద్దులు లేని ఏఐ రేసులో భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయకపోతే, రేపు ఈ ‘రెక్లెస్’ ఏఐ వ్యవస్థలు మన కీలకమైన మౌలిక వసతులు, రక్షణ వ్యవస్థలు, డేటా భద్రతపై దాడి చేయవన్న గ్యారెంటీ ఏంటి? శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరచి కఠిన చట్టాలు, నియంత్రణలు తీసుకురావాలి. లేకపోతే.. మనిషి సృష్టించిన ఏఐయే, మనిషికి అంతిమ శత్రువుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి!
: CLN RAJU (EDITOR- NTV DIGITAL)
- Tags
- AI
- Explainers in Telugu
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!