BTech Fees 2026: ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీటెక్ కనీస వార్షిక ఫీజు రూ.47 వేలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ ఇంజినీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్, బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్) కోర్సులకు తాత్కాలిక ఫీజును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీవో ప్రకారం.. ఈ విద్యా సంవత్సరానికి కనీస వార్షిక ఫీజును రూ.47 వేలుగా నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ తుది ఫీజులను నిర్ణయించే వరకు ఈ ఇంటరిమ్ ఫీజులు అమల్లో ఉంటాయి. EAPCET 2026 కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా కొనసాగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే గతంలో నిర్ణయించిన ఫీజులు రూ.47 వేల కంటే ఎక్కువగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు అదే ఫీజులను కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. కమిటీ తుది ఫీజులను ప్రకటించిన తర్వాత ఆ నిర్ణయం ప్రకారం ఫీజులు అమలులోకి వస్తాయని పేర్కొంది. తుది ఫీజులు నిర్ణయించిన తర్వాత ఇంటరిమ్ ఫీజు కంటే తక్కువగా ఉంటే విద్యార్థులకు అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని కళాశాలలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది లేదా భవిష్యత్ ఫీజుల్లో సర్దుబాటు చేయాలి. ఒకవేళ తుది ఫీజు ఎక్కువగా నిర్ణయిస్తే.. ఆ ఫీజును ప్రభుత్వ నిబంధనల ప్రకారం వసూలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి కళాశాల కూడా తుది ఫీజు నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని అనుబంధ విశ్వవిద్యాలయానికి అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కళాశాలలు నోటిఫై చేసిన ఫీజు తప్ప మరే పేరుతోనూ అదనపు మొత్తాలు వసూలు చేయకూడదు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు లేని కళాశాలలు ఎలాంటి ఫీజులు వసూలు చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. కొత్తగా ప్రారంభించిన కోర్సులకు అదే కళాశాలలో అమలులో ఉన్న ఇతర కోర్సుల ఫీజులను తాత్కాలికంగా వర్తింపజేయాలని, అనంతరం కమిటీ నిర్ణయించే కోర్సు వారీ ఫీజులు అమల్లోకి వస్తాయని పేర్కొంది. విద్యార్థులు అడ్మిషన్ సమయంలో వసూలు చేస్తున్న ఫీజు తాత్కాలికమని, APHEFRMC తుది నిర్ణయం తర్వాత మార్పులకు లోబడి ఉంటుందని కళాశాలలు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!