Family suicide to escape alcoholic husband: మద్యం వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు చితికిపోతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మద్యం కారణంగా ఏకంగా ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తాగుబోతు భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య, కొడుకు, కూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నార్సింగ్ పూర్ లో జరిగింది.
Read Also: Bilawal Bhutto Zardari: కాశ్మీర్ అంశాన్ని ముఖ్యమైన ఎజెండా చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది..
మద్యం మత్తులో ఉన్న భర్త వేధింపుల నుంచి తప్పించుకోవడానికి భార్య యక్తవయసులో ఉన్న తన కుమారుడు, కుమార్తెలతో కలిసి కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు భార్య అనిత కౌరవ్ (38), కుమారుడు సెజల్ (19), కుమార్తె షాని (16) ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. నార్సింగ్ పూర్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదర్వారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ పై 3 మృతదేహాలు పడి ఉన్నట్లు మాకు సమాచారం వచ్చిందని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన కుమారుడి జేబులో నుంచి సూసైడ్ నోట్ బయటపడింది. తన తండ్రి తరచూ తాగి వచ్చి తమను ఇబ్బంది పెట్టడం వల్లే ముగ్గురం ఆత్మహత్య చేసుకున్నామని అందులో ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తండ్రిని అరెస్ట్ చేశారు.
కజ్రౌతా గ్రామానికి చెందిన అనిత కౌరవ్, లిల్వానీ గ్రామానికి చెందిన పప్పు అలియాస్ రాజ్‌కుమార్ కౌరవ్‌తో వివాహం జరిగింది. కొన్నాళ్లుగా పంచవటి కాలనీలో భర్తతో కలిసి ఉంటున్నా.. భర్త మద్యానికి బానిస కావడంతో ఆమె చాలా కాలంగా తల్లిగారింట్లో ఉంటూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం భర్త ఆమెను, పిల్లలను గదర్వార పంచవటి కాలనీకి తీసుకొచ్చాడు. మళ్లీ ఆమె, పిల్లలను భర్త చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులు తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది.