Instagram Reels: ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్ గా తమ టాలెంట్ ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి. వ్యూస్ పెరగడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చత్తీస్ గఢ్ లో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్ మోజులో పడి ప్రాణాలు కోల్పోయాడు ఓ యువకుడు.
Read Also: Viral Video: జస్ట్ మిస్.. కాస్తయితే సొరచేపకు బ్రేక్‌ఫాస్ట్ అయ్యేది..
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని ఒక కళాశాలలో చదువుతున్న 20 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని ఇన్‌స్టాగ్రామ్ రీల్ షూట్ చేస్తున్న సమయంలో కిందపడి మరణించాడు. బిలాస్‌పూర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అశుతోష్ సావో తన ఐదుగురు స్నేహితులతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ రీల్ షూట్ చేసేందుకు కళాశాల ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లాడు. టెర్రస్ పై షూట్ చేస్తున్న సమయంలో టెర్రస్ పై ఉన్న కిటీకి స్లాబ్ నుంచి టెర్రస్ గోడపైకి దూకేందుకు ప్రయత్నించాడు. ఇలా చేయడం వల్ల నేను తిరిగి తిరిగిరాకపోవచ్చని సావో అన్నాడు.. అయితే అతని స్నేహితులు మాత్రం నీకేం కాదంటూ సావోను ప్రోత్సహించి ప్రాణాలు కోల్పోయేలా చేశారు. దీని పై దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ సమయంలో 20 అడుగుల ఎత్తు నుంచి సావో కిందపడి, తీవ్రగాయాలపాలై మరణించాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. వ్యూస్ కోసమో, ఫేమస్ కావడం కోసమో ఇలాంటి రిస్కీ షాట్స్ తీసుకుని ప్రాణాలు మీదికి తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
#socialmedia में #viral होने और थोड़े से #Like के लिए पता नहीं लोग अपनी जान जोखिम में क्यूँ डाल देते हैं। #Bilaspur का एक छात्र #Reel बनाने के लिए कालेज कैम्पस की बिल्डिंग में चढ़ गया और हादसे का शिकार हो गया। दुःखद बहुत पीड़ादायक
Plz ऐसा ना करें 🙏#ViralVideos #CGNews pic.twitter.com/Abgh0Mo0FN— Anshuman Sharma (@anshuman_sunona) March 17, 2023