New Delhi : పొగాకు వ్యసనం నుంచి బయటపడేందుకు దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో ప్రత్యేక క్లినిక్‌లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం, న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) కూడా తన ఉత్తర్వును జారీ చేసింది,
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. జనగామ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది.
NEET: ఏడాదికి రెండుసార్లు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ని నిర్వహించేలా జాతీయవైద్య కమిషన్(ఎన్ఎంసీ), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి భారతి ప్రవన్ పవార్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏం లేదని ఆమె లోక్ సభకు తెలియజేశారు. నీట్ ను ఏడాదికి రెండుసార్లు నిర్వహించే ఆలోచన లేదని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం లోక్ సభకు తెలిపింది.
అభ్యర్థుల ప్రయోజనం కోసం మరిన్ని సీట్లను చేర్చడానికి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సోమవారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేసింది.
కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.