PM Modi: దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈరోజు (శనివారం) దోడా జిల్లాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కుటుంబం అనే మూడు కుటుంబాలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Mehabooba Mufti: శ్రీనగర్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సభలో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, జేకే నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమికి (India Bloc) దెబ్బ మీద దెబ్బలు తగలుతున్నాయి. ఇప్పటికే కూటమిలోని పార్టీలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సొంత నిర్ణయాలతో ముందుకు పోతున్నాయి.
నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గత తగాదాలను దురదృష్టకర పరిస్థితి అని అన్నారు.
2018లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 'పాకిస్తాన్ జిందాబాద్' అనే నినాదాన్ని లేవనెత్తారు. ఈ పెద్ద వివాదం తర్వాత ఐదేళ్ల తర్వాత, సుప్రీంకోర్టు సోమవారం మహ్మద్ అక్బర్ లోన్‌ను భారత రాజ్యాంగానికి విధేయతగా ప్రమాణం చేసి, దేశ సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
పూంచ్ ఉగ్రదాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. పూంచ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నిందితులపై ఆపరేషన్ సమయంలో అమాయకులను వేధించవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా భద్రతా ఏజెన్సీలను కోరారు.
ఎన్నికలు ప్రజల హక్కు అని... జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కశ్మీరీలు కేంద్రం ముందు అడుక్కోరని.. వారు బిచ్చగాళ్లు కాదని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి. తాజాగా శరద్ పవార్…