PM Modi: దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఈరోజు (శనివారం) దోడా జిల్లాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కుటుంబం అనే మూడు కుటుంబాలు దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని దోచుకున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా జమ్మూలో ఉన్న దుర్భరమైన స్థితికి ఈ మూడు కుటుంబాలు బాధ్యులు అన్నారు. వారు అవినీతికి పాల్పడ్డడంతో పాటు అవసరాల కోసం మిమ్మల్ని కష్ట పెట్టారు అని ఆయన పేర్కొన్నారు. ఈ మూడు కుటుంబాలు కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, తీవ్రవాదానికి పునాది వేశారు అని మండిపడ్డారు.
Read Also: Viagra: అలాంటి వారు వయాగ్రా తీసుకోకుంటేనే మంచిది..
ఇక, జమ్మూ కశ్మీర్ లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. సుసంపన్నమైన ప్రాంతంగా తయారు చేస్తాం.. అది “మోదీ కి గ్యారెంటీ” అని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. కశ్మీర్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు మూడు రాజకుటుంబాలకు.. ఇక్కడి యువతకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఒక కుటుంబం కాంగ్రెస్‌కు చెందినది, ఒకటి నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందినది కాగా, మరో కుటుంబం పీడీపీకి చెందినది తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్ర పాలిత ప్రాంతం యొక్క భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అయితే, జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం అట్టడుగు స్థాయికి చేరుకుంటుంది అన్నారు. ఒకప్పుడు సాయంత్రం తర్వాత అప్రకటిత కర్ఫ్యూ ఉండేదని లాల్ చౌక్‌ను సందర్శించాలంటే తనకు భయంగా ఉందని అప్పటి కాంగ్రెస్ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యను ప్రధాని గుర్తు చేశారు. కానీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ కశ్మీర్ లో ఇటీవలి సంవత్సరాలలో మారుతున్న పరిస్థితులను నరేంద్ర మోడీ ప్రస్తావించారు.