CM Omar Abdullah: జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మేబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ నియామకాలపై రిజర్వేషన్ అంశాన్ని గతంలో తమ వద్ద అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు లేవనెయ్యలేదంటూ విమర్శలు గుప్పించారు. సీఎం మీడియాతో మాట్లాడుతూ.. మేబూబా ముఫ్తీకి ఓట్లు కావాలనుకున్నప్పుడు, పార్టీ సభ్యులు రిజర్వేషన్ గురించి మాట్లాడొద్దని అన్నారు. అనంత్‌నాగ్ లో…
శ్రీనగర్‌లోని రాజ్ భవన్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ సీనియర్ నేత ముబారక్ గుల్ ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ముబారక్ గుల్ చేత ప్రమాణం చేయించారు.
జమ్మూకాశ్మీర్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఒమర్ అబ్దుల్లాతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఎన్సీ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర హోదా ఇవ్వాలనే తీర్మానాన్ని ప్రధాని మోడీకి సమర్పిస్తామన్నారు. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, రాష్ట్ర హోదా లాంటి వాటి మీద తీర్మానం చేస్తామన్నారు. కొందరు నేతలు జమ్మూకశ్మీర్‌ను ఢిల్లీతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూకాశ్మీర్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని.. హంగ్ ఏర్పడడం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయి. కానీ ఈవీఎంల ఫలితాలు వచ్చేటప్పటికీ అంచాలన్నీ తలకిందులయ్యాయి.
Elections Results: నేడు హరియాణా, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం నుండి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరియాణా రాష్ట్రములోని ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. కౌంటింగ్ మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో జోరు చూపించగా.. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. దీంతో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడుతోందని చెప్పవచ్చు. దింతో రాజకీయ నాయకులు టెన్షన్.. టెన్షన్.. గా ఉన్నారు. ఇకపోతే అటు జమ్మూకశ్మీర్ లో వార్ వన్…
National Conference: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ఎన్నికల ఫలితాల తర్వాత “వ్యూహాత్మక పొత్తు” కు “నేషనల్ కాన్ఫరెన్స్” (ఎన్.సి) సిద్దమే అని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రాభివృద్ధే, అభ్యున్నతే అందరి లక్ష్యం అయునప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఏముంద.? ఎందుకు కాకూడదు? అంటూ.. ఎన్నికల్లో ప్రత్యర్థులం కావచ్చు. నాకెలంటి అభ్యంతరం లేదు.. బహుశా కాంగ్రెస్ పార్టీకి కూడా ఏలాంటి అభ్యంతరాలు ఉండవనే అనుకుంటున్నానని ఆయన అన్నారు.…