హెల్త్ కేర్ 3డీ ప్రింటింగ్ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. టీ వర్క్స్ ద్వారా అనేక ప్రోటో టైప్స్ రూపొందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్‌లో 3డీ ప్రింటింగ్‌పై జరిగిన జాతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో వివిధ సంస్థలు…