భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ వేడుక రేపు (జూన్ 9) రాత్రి 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్లో జరగబోతుంది. ప్రధానితో పాటే కొత్త మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి మొదలుకుని విదేశీ అతిథులు హాజరుకాబోతున్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు రావు కన్నుమూతపై సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్న ఆయన.. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని గుర్తుచేశారు.. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు
భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు (జూన్ 9న) ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్ల జరుగుతున్నాయి. ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు.
దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు భేటీ అయి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపింది.
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోడీ, ఎన్డీయే మిత్రపక్షాలు సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోడీ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని మోడీ కోరారు
శుక్రవారం నాడు జరిగిన ఎన్డిఏ కూటమి మీటింగ్ లో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్ష భారత కూటమిపై విరుచుకుపడ్డాడు. ఫలితాలు ప్రకటించినప్పుడు నుండి ఇండి కూటమి వాళ్ళు ఓటింగ్ మిషన్లు బాగానే బ్రతికే ఉన్నాయా.. చనిపోయాయా.. అంటూ రిగ్గింగ్ ఆరోపణలను ప్రసావిస్తుండగా ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు ఇవియం పై నిందలు వేసి భారతీయ ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేసేందుకు వారు ప్రయత్నించారని మోడీ ఆరోపించారు. Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్…
Narendra Modi Speech: నేడు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలోని సంవిధాన్ సదన్(పాత పార్లమెంట్) భవనంలో ఎన్డీయే కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏక్రగీవంగా ఎన్నుకున్నారు. మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశ పెట్టారు. అనంతరం ఎన్డీయే కూటమి పార్టీల నేతలంతా మోదీకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీయే పక్ష నేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. నాపై విశ్వాసం ఉంచి ఎన్డీయే నేతగా ఎన్నుకున్నారు. దేశానికి ఇంకా…
బీహార్ రాష్ట్రంలోని పూర్నియా లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా గెలుపొందిన పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని జోస్యం చెప్పారు.
మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 9వ తేదీన సాయంత్రం 6 గంటలకు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.