ఇటీవల తన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడాన్ని ప్రశ్నిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై, ఆయన రాజకీయ ప్రత్యర్థులపై ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పక్షాన వినిపించిన తన గొంతును అణచివేయడానికి రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ప్రయత్నమని ఇసి పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. EC విధించిన 48 గంటల నిషేధం తర్వాత, మాజీ ముఖ్యమంత్రి శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రామగుండంలో భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. “సీఎం,…
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే స్వయంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు బాల్క సుమన్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజాదరణ పొందుతున్న మాజీ…
‘సీబీఐ కేంద్రం నియంత్రణలో లేదు’.. సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వాస్తవానికి అనేక కేసుల్లో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని సీబీఐ తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇందులో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రాష్ట్రం ఉపసంహరించుకున్నప్పటికీ, ఫెడరల్ ఏజెన్సీ ఎఫ్ఐఆర్ నమోదు…
చంద్రబాబు హామీలను నమ్మే పరిస్థితి లేదు.. ఆయన మేనిఫెస్టోపై ఎవరికి నమ్మకం లేదు.. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు.. ఆయన మేనిఫెస్టో పై ఎవరికి నమ్మకం ఉండదు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై హాట్ కామెంట్లు చే శారు.. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు…
తెలంగాణ భవన్లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగలకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షలు కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్త్ లకు…
ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. జగన్‌కు ఓటు వేస్తే పథకాలు అన్ని వస్తాయని.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వదలి బొమ్మాలీ…
జహీరాబాద్‌లో నేడు బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారం. కేతకి సంగమేశ్వర, ఏడుపాయల దుర్గా అమ్మవారు, బసవేశ్వరునికి నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూశారని, కాంగ్రెస్ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం అవినీతిమయం అయిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీఆర్ఎస్ లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్…
ఈ ఎన్నికల్లో మోడీకే వేస్తామని ప్రజలు అంటున్నారు… దేశ భవిష్యత్, మా భవిష్యత్ ముఖ్యం అని అంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ జహీరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయని, బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్, BRS గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ పార్టీ వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది… గ్రేటర్ కార్పొరేషన్…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశముంది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర కార్యాలయానికి సమాచారం పంపింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు… ఆరోజు ఉదయం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వేములవాడలో పర్యటిస్తారు. ప్రధాని రాక సమాచారాన్ని అందుకున్న జిల్లా నాయకత్వం సభాస్థలి, ఏర్పాట్లపై ద్రుష్టి సారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి వేములవాడ రానున్న నేపథ్యంలో దక్షిణ…