Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
స్వదేశంలో చైనాను ఓడించి.. ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య చైనా, భారత్ మధ్య జరిగింది. భారత జట్టు ఆరోసారి ఫైనల్ ఆడుతుండగా, చైనాకు ఇది తొలి ఫైనల్. చైనా జట్టు తొలిసారి టైటిల్‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నించి టీమ్ఇండియాకు గట్టి పోటీనిచ్చింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత హాకీ జట్టు మరోసారి తన సత్తాను చాటుకుంది. భారత హాకీ జట్టు 1-0తో చైనాను ఓడించి టైటిల్‌ను కైవసం…
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు పార్థసారధి ఆ పదవిలో కొనసాగారు. ఆయన పదవీ కాలం ఇటీవలే ముగియడంతో ప్రభుత్వం రాణి కుముదిని నియమించింది. 1988 బ్యాచ్‌కి చెందిన కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు సందర్భంగా దేశ, విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ అంటూ విషెస్ చెప్పారు.
తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాయక నవరాత్రులకు కానుకను అందించనున్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రైలు కనెక్టివిటీని మరింత పెంచేందుకు తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య…
Vladimir Putin: బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నిన్న (గురువారం) రష్యాలోని సెయింట్ పీటర్స్ వర్గ్లో వ్లాదిమీర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌తో దోవల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు.
Russia: రష్యా ఆర్మీలో అక్రమంగా చేరి, ఉక్రెయిన్‌తో పోరాడుతున్న భారతీయులకు విముక్తి లభించింది. 45 మంది భారతీయులను యుద్ధ ప్రాంతం నుంచి రక్షించి, రష్యా సైన్యం నుంచి డిశ్చార్జ్ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ రోజు వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇంకా 50 మంది యుద్ధభూమిలో ఉన్నారని, వారిని రక్షించి విడుదల చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలోనే భారతదేశ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇంకా పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.