PM Modi: హిందీ, తమిళ భాషా వివాదం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, సీఎం స్టాలిన్‌ని ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడు నుంచి తనకు అనేక మంది నాయకుల లేఖలు వచ్చాయని, వారిలో ఎవరూ కూడా తమిళంలో సంతకం చేయలేదని ప్రధాని మోడీ అన్నారు. వారు తమ భాష పట్ల నిజంగా గర్వపడితే, కనీసం తమిళంలో అయినా తమ పేర్లను సంతకంగా చేయాలని కోరారు.
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. అయితే అనేకమంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని చెప్పారు. జాతీయ భావజాలం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ…
పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు.. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ…
Nidhi Tewari: ప్రధాని నరేంద్రమోడీ తదుపరి ప్రైవేట్ సెక్యూరిటీగా 2014 ఐఎఫ్ఎస్ అధికారి నిధి తివారీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆమె ప్రస్తుతం, ప్రధాని కార్యాలయం(పీఎంఓ)లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆమె ఈ పదవిలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతారు. మంగళవారం ఆమె నియామకాన్ని ధ్రువీకరిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ (DoPT) నుండి ప్రకటన వెలువడింది. Read Also: Health Tips: నెల పాటు ప్రతిరోజూ 20 పుష్-అప్‌లతో శరీరంలో అద్భుతమైన మార్పులు.. ‘‘ప్రధానమంత్రి…
Sanjay Raut: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయాన్ని సందర్శించడంపై శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పదవీ విరమణ ప్రణాళికలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు మోడీ తెలియజేశారని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీని కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. 2022, నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీగా నిధి తివారీ పనిచేస్తున్నారు.
Pamban Bridge: తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరంలో పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామ నవమి సందర్భంగా పంబన్ బ్రిడ్జిను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ కు ఒక లేఖ అందింది. ఈ లేఖను బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మోడీ రాశారు. బంగ్లాదేశ్ మార్చి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది.
Kishan Reddy : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని…
Kishan Reddy : ఇవాళ చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ…