విద్యుత్ మీటర్ల విషయంలో కొన్ని రాజకీయ పార్టీలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించటమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇప్పటి వరకూ 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం. త్వరలోనే మరో 77వేల కనెక్షన్లను ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాం. 2023 మార్చి నాటికి వంద శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందని మంత్రి తెలిపారు.
ఇప్పటికే 70 శాతం మంది రైతులు డీబీటీ కోసం ఖాతాలను తెరిచారు. స్మార్ట్ మీటర్ల వల్ల రైతులు నష్టపోయేది ఏమీ లేదు. స్మార్ట్ మీటర్ల వల్ల 30 శాతం మేర సబ్సిడీ చెల్లింపులో ప్రభుత్వానికి ఆదా అవుతోంది. పైలట్ ప్రాజెక్టుగా చేసిన శ్రీకాకుళం జిల్లాలో ఇది నిరూపితమైంది.స్మార్ట్ మీటర్లపై మాట్లాడే ప్రతిపక్షాలు ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించాలి. చంద్రబాబుకు వంత పాడుతున్న జనసేన, కమ్యూనిస్టు నేతలే అపోహలు సృష్టిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టే వారి చేతులు నరకాలని అనడం దారుణం. రాజకీయ స్వార్థం కోసం రైతులను అడ్డం పెట్టుకుంటున్నారు.
Read Also: Polavaram Project Virtual Meet: పోలవరంపై ముగిసిన నాలుగు రాష్ట్రాల వర్చువల్ భేటీ
విద్యుత్ మీటర్లు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే విపక్షాలు ఆందోళనలకు దిగాయి. రైతులకు నష్టం చేకూర్చేలా వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లను బిగించాలన్న నిర్ణయం తీసుకున్నారని సిపిఐ నారాయణ మండిపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పద్దతిలోనే రైతులకు ఉచిత కరెంట్ అందించాలన్నారు. అలా కాదని మీటర్లు బిగించాలని చూశారో… అప్పుడు ఏం జరుగుతుందో చూడండి అంటూ నారాయణ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు.
Read Also:JD Laxminarayana: ‘భీమదేవరపల్లి బ్రాంచి’లో జేడీ లక్ష్మీనారాయణ!