ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడు నరసింహంపై ఫోర్జరీ, చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ వార్తలపై సోము వీర్రాజు స్వయంగా స్పందించారు. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని… వీరిలో పెద్దమ్మాయికి తాను పెళ్లిచేయలేదని వివరణ ఇచ్చారు. తనకు ఇద్దరే అల్లుళ్లు ఉన్నారని సోము వీర్రాజు స్పష్టం చేశారు. తన పెద్దమ్మాయి తానే పెళ్లిచేసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఆమె పెళ్లిచేసుకున్న వ్యక్తికి తాను కాళ్లు కడిగి కన్యాదానం చేయలేదని… కాబట్టి అతడిని తన అల్లుడిగా ఎప్పటికీ…