తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా…
ఎంపీడీవో కుటుంబ సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరామర్శించారు.. ఈ సందర్భంగా చంద్రబాబుకి ఫోన్ చేసి వెంకటరమణ భార్యతో కలెక్టర్ మాట్లాడించారు. మిస్సైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు.
ఎన్నికల్లో జగన్ కి ఓటు వేస్తే పథకాలను కొనసాగింపు.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు అంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది.. జరగబోయే ఎన్నికలు కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిపించడానికి మాత్రమే కాదు.. ఇంటింటి సంక్షేమం పథకాల కొనసాగింపు కోసం అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి, వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్రనాయకత్వం ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తనని సస్పెండ్ చేసినట్లు సమాచారం అందిందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చాను. 12ఏళ్ల వయసు నుంచే రాజకీయాలపై ఆసక్తి పెరిగింది.. నేను రాజకీయాల్లోకి వచ్చే సమయానికి టీడీపీ లేదు.. కేవలం కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే వున్నాయన్నారు. NTR అంటే వున్న అభిమానంతో టీడీపీలో…
అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఇప్పటికే గంజాయి విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేశారు.. ఇక, ఈ మధ్యే విశాఖలో పర్యటించిన జనసేనాని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు.. అయితే, ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు పవన్ కల్యాణ్.. ఈ నెల 21న నరసాపురంలో పర్యటించనున్నారు..…