CM Chandrababu: రెండో రోజు ఎంపీడీవో వెంకట రమణ ఆచూకీ దొరకలేదు.. మచిలీపట్నం రైల్వేస్టేషన్ సమీపంలో సీసీ టీవీ ఫుటేజ్ లో టికెట్ తీసుకుంటున్న ఎంపీడీవోని పోలీసులు గుర్తించారు. విజయవాడ- ఏలూరు కాల్వ సమీపంలో కూడా సీసీ టీవీ ఫుటేజ్ లో వెంకట రమణను గుర్తించారు. నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రేపు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగనుంది.
Read Also: Rain Alert: ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు.. ఆ జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్..?
ఇక, ఎంపీడీవో కుటుంబ సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరామర్శించారు.. ఈ సందర్భంగా చంద్రబాబుకి ఫోన్ చేసి వెంకటరమణ భార్యతో కలెక్టర్ మాట్లాడించారు. మిస్సైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వెంకటరమణ మిస్సింగ్ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఈ విషయంపై ఇంట్లో ఏమన్నా చెప్పారా.. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు అనే విషయాల్ని అడిగి సీఎం తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు తెలిపారు.