బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు… కవితను పార్టీ లోకి తీసుకోము..
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదని… కవితని పార్టీ లోకి తీసుకోమని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ టాక్స్ అన్న వారి తలలో మెదడు లేదు పెండ(గోబర్) ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే.. ఆ రెండు పార్టీ లు అన్నదమ్ములు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి కేవలం బ్యారేజీలపైనే కాదు.. మొత్తం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ జరపాలన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కవిత గురించి ఎక్కువగా ఆలోచించొద్దని తెలిపారు. యూరియా కొరతపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ పొరపాటు వల్లనే తెలంగాణలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
జాన్వీపై అపార్థం తొలగించిన పవిత్రా మేనన్..
జాన్వీ కపూర్ నటించిన తాజా రొమాంటిక్ కామెడీ ‘పరమ్ సుందరి’ ఇప్పటికే చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో జాన్వీని మలయాళ యువతిగా చూపించడం కొందరికి నచ్చకపోవడంతో విమర్శలు వచ్చాయి. “మలయాళ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయాలంటే, అక్కడి నటీమణులే లేరా?” అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో గాయని పవిత్రా మేనన్ ఒక వీడియో విడుదల చేయగా ఈ వార్త తెగ వైరల్ అయ్యింది. అయితే..తాజాగా పవిత్రా దీనిపై స్పష్టతనిచ్చారు. ఆమె మాట్లాడుతూ.. “నేను నటి కాదు, గాయనిని మాత్రమే. జాన్వీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. నా ఉద్దేశం వేరే. ఇది వృత్తిపరమైన అసూయ కాదు. నేను ఎవరి అవకాశాలు లాక్కోవాలని అనుకోలేదు. కేవలం భాష గురించి మాత్రమే మాట్లాడాను. మలయాళ పాత్రలు చేసే వారు భాషను సరిగ్గా నేర్చుకోవాలి అనేదే నా పాయింట్. జాన్వీ ఆ పాత్రకు న్యాయం చేసింది. ఆమెను నేను వ్యక్తిగతంగా కూడా రెండు సార్లు కలిశాను. ఆమె చాలా సింపుల్ & డెడికేటెడ్ ఆర్టిస్ట్” అని స్పష్టం చేశారు. మొత్తనికి దీంతో ఈ వివాదానికి ఒక తేర పడింది. ఇక ‘పరమ్ సుందరి’ లో జాన్వీకి జోడీగా సిద్ధార్థ్ మల్హోత్రా నటించగా. కేరళ యువతి – ఢిల్లీ యువకుడి ప్రేమకథగా ఈ చిత్రానికి సెంటర్ పాయింట్. తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 29న విడుదలై ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్ మూవీకిలో కెరళ ట్రేడినల్ టచ్ ఇవ్వడం మూవాకి మరింత ప్లేస్ అయ్యింది.
25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్పిన్నర్
ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత, టీం ఇండియాకు చెందిన మరో స్పిన్నర్ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను మరెవరో కాదు.. టీం ఇండియా లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. తన 25 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. టీం ఇండియా లెజెండరీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అమిత్ మిశ్రా IPLలో కూడా ఒక స్టార్. ఈ ఫార్మాట్‌లో 3 హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్ అతనే. 42 ఏళ్ల అమిత్ మిశ్రా భారతదేశం తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 156 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్‌లో 162 మ్యాచ్‌ల్లో 174 వికెట్లు పడగొట్టాడు.
మరోసారి ఢిల్లీకి మంత్రి లోకేష్.. రేపు ప్రధాని మోడీతో భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఇవాళ రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ఆయన.. రాత్రి అక్కడే బస చేస్తారు.. ఇక, రేపు అనగా శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు మంత్రి లోకేష్.. యోగాంధ్ర నిర్వహణపై ప్రధానికి వివరించనున్నారు.. యోగాంధ్ర పై తయారు చేసిన బుక్‌ను ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందజేయనున్నారు మంత్రి నారా లోకేష్.. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు.. ఇక ప్రధాని మోడీతో సమావేశం తర్వాత.. రేపు తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు మంత్రి నారా లోకేష్. రేపు.. అమరావతిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు..
త్వరలోనే బీహార్ ఎన్నికల షెడ్యూల్.. ఎన్నికలు ఎప్పుడంటే..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దశలో కాకుండా.. రెండు, మూడు దశల్లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్‌లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారం ప్రారంభంలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించవచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 2న దసరా పండుగ ఉంది. ఆ పండుగ అవ్వగానే షెడ్యూల్ విడుదల చేసే ఛాన్సుంది.
ఇరవై మందికి పైగా ఫైనలిస్టులు ఎంపిక.. హౌస్‌లో ఎంట్రీ సస్పెన్స్ !
సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెడతారు. అందులో 5 మంది అగ్నిపరీక్ష ఆడియన్స్ ఓట్స్ ద్వారా సెలెక్ట్ చేయబడ్డారు. తదుపరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటాయి. అయితే మరి ఈ హౌస్‌లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి ప్రజంట్ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది.
కరీంనగర్ కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్న వర్గపోరు
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల జేఏసీ, కరీంనగర్ పార్లమెంట్ ఇన్‌ఛార్జి వెలిశాల రాజేందర్ రావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ రావు, ఎస్సీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని పలువురు నేతలు ఆరోపించారు. జిల్లాలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటోలు ఫ్లెక్సీలలో ముద్రించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ సంఘాలు తెలంగాణ చౌక్‌లో నిరసన తెలిపాయి. కాంగ్రెస్ నేత రాజేందర్ రావు ఫ్లెక్సీని తగలబెట్టేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, వెంటనే వెలిశాల రాజేందర్ రావును కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలని ఎస్సీ దళిత సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షన జరిగిన సమావేశంలో.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.. రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య ధీమాను కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది.. ఏడాది ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలు అయ్యేలా నిర్ణయించింది.. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వ కార్యాచరణ రూపొందించింది..
అప్రమత్తంగా ఉండటం వల్లే ఆస్తినష్టం జరిగినా.. ప్రాణనష్టం తగ్గించగలిగాం
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో వరదలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గురువారం కామారెడ్డిలోని జీఆర్ కాలనీని సందర్శించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, తక్షణ సాయం అందించేలా అధికారులను ఆదేశించారు. సీఎం మాట్లాడుతూ, “అప్రమత్తంగా ఉండటం వల్ల ఆస్తినష్టం జరిగినా… ప్రాణనష్టం తగ్గించగలిగాం. వరదలు రాగానే ఇంచార్జ్ మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ, ఎంపీ షెట్కర్, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేశాను. అయినప్పటికీ మీ సమస్యలను ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడికి వచ్చాను” అని తెలిపారు.
వరద నష్టం నివేదికతో కేంద్ర సహాయం కోరిన తెలంగాణ మంత్రులు
తాజా భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయిన నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సమావేశమైన భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ అంశాలపై చర్చించారు. అంతేకాదు, తెలంగాణలో విస్తారంగా పండించే పామాయిల్‌పై విధిస్తున్న సుంకాలను తగ్గించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు అవసరమైన ఆర్థిక సాయం అందించాలన్న విజ్ఞప్తులను కూడా నిర్మల సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లారు.