నారా లోకేష్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ మంత్రి పేర్నినాని… ఒక ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయం చేసే తుచ్ఛ సంస్కృతి లోకేష్‌ది అని మండిపడ్డ ఆయన.. ఈ సమాజంలో మృగాలు ఉన్నాయి… మేమేం చర్యలు తీసుకోకపోతే తప్పు.. కానీ, వాళ్లని వేటాడతాం.. కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.. వైఎస్ జగన్ హయాంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసిన మంత్రి పేర్నినాని.. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. కానీ, పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన లోకేష్ ఇలాంటి దౌర్భాగ్య స్థితికి వెళ్లడం శోచనీయం అన్నారు మంత్రి నాని.. వాళ్లకి మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేయాలి.. కానీ, రాజకీయం చేయడం ఏమిటి..? అని ప్రశ్నించిన ఆయన… ఇన్ని చేస్తున్నా మనిషి ముసుగులో ఉన్న మృగాలు మానవత్వం లేకుండా విరుచుకుపడుతున్నాయన్నారు.. లోకేష్ ఉద్యోగం ఓడిపోయిన రాజకీయ నిరుద్యోగి… ఇప్పుడు ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమో అనే భయంతో విచక్షణ మరిచి మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు.. చుట్టూ ఉన్న 10 మందితో చప్పట్లు కొట్టించుకోవడం కాదు.. 5 కోట్ల ఆంధ్రులతో చప్పట్లు కొట్టించుకోగలగాలని హితవుపలికిన మంత్రి పేర్నినాని.. భయపడి చచ్చే వారే ఛాలెంజ్ చేస్తున్నారు… లెక్కలు తీయడం మొదలెడితే కక్ష సాధింపు అంటారని.. గడ్డం పెంచిన వాడల్లా గబ్బర్ సింగ్ కాలేడు అంటూ కామెంట్ చేశారు..