కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నారా లోకేష్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అనంతపూర్ కర్నూలు కడప జిల్లాలో వర్గాలు ఉంటాయి పార్టీలు చూడరు. పాత రోజుల్లో కక్షల పెట్టుకుని ఒకరినొకరు చంపుకుంటూ ఫ్యాక్షనిజం ఈ మూడు జిల్లాలలో ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్న లోకేష్ ని నువ్వు ఎవడివిరా అని అడుగుతున్నా… నువ్వు ఒక బచ్చావి నీకు అసలు తెలుగు మాట్లాడటం సరిగా రాదు. నువ్వు పోటీ చేసిన ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా మందల గిరి నియోజకవర్గం అని మాట్లాడతావు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటావా… తాట తీసేస్తాం జాగ్రత్తగా ఉండండి జిల్లాలలో కూడా తిరగలేరు అన్ని హెచ్చరించారు.
Read Also : హరీష్‌రావు, వినోద్‌కుమార్‌లకు హుజురాబాద్ బాధ్యతలు…?
నువ్వు పిల్ల కుంకవి పిల్లోడివి నీ వయసెంత నువ్వెంత నువ్వు జగన్ మోహన్ రెడ్డిని రేయ్ అంటావా వాడు అంటావా… నువ్వు అడ్డదారిన మంత్రి పదవి సంపాదించుకున్నవు ఆ మంత్రి పదవి ఏ విధంగా చేయాలని తెలియదు. నువ్వు ఏ విధంగా కలక్షన్ తీసుకుని రోడ్లు ఇచ్చావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మర్యాద నేర్చుకో… నీ వయసు ఎంత నువ్వెంత అన్నారు. నోరు అదుపులో పెట్టుకో నువ్వు చంద్రబాబు నాయుడు కొడుకు అయ్యుండొచ్చు మా జగన్మోహన్రెడ్డి వెంట్రుక కూడా పీకలేవు. పిచ్చి వేషాలు వెయ్యొద్దు అని తెలిపారు.